Samantha : మళ్లీ ఇలాంటి రోజు వస్తుందని అస్సలు ఊహించుకోలేదు – సమంత
Samantha : ఆ సమయంలో తాను గ్లాస్ ఎత్తలేని పరిస్థితికి చేరిపోయానని చెప్పిన సమంత, ఇప్పుడు మళ్లీ 90 కేజీల బరువు ఎత్తే స్థాయికి వచ్చాను
- By Sudheer Published Date - 12:51 PM, Sat - 31 May 25

టాలీవుడ్ ప్రముఖ నటి సమంత (Samantha) తన ఆరోగ్య సమస్యల్ని జయించి మళ్లీ ఫిట్‌నెస్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. గతంలో జిమ్‌లో వంద కేజీల బరువులు ఎత్తే స్థాయిలో ఉండే సమంత, కరోనా కాలంలో మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురయ్యారు. ఆ సమయంలో తాను గ్లాస్ ఎత్తలేని పరిస్థితికి చేరిపోయానని చెప్పిన సమంత, ఇప్పుడు మళ్లీ 90 కేజీల బరువు ఎత్తే స్థాయికి వచ్చాను అంటూ తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. జిమ్‌లో వారం రోజులు కష్టపడిన వీడియోను షేర్ చేస్తూ, తన పునరాగమనాన్ని ఇన్స్పిరేషన్‌గా మార్చారు.
Visakha Metro : విశాఖ మెట్రో ప్రాజెక్ట్‌కు జోరు.. నగర రూపు మార్చనుందా..?
సమంత తన ఆరోగ్యం కోసం అన్ని రకాల వైద్య పద్ధతులు ప్రయత్నించారు. అలోపతి, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, మూలిక చికిత్సలు, ఐస్ బాత్ వంటి వైద్య విధానాల్ని పాటించడమే కాక, భూటాన్ వెళ్లి ప్రత్యేక చికిత్సలు కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో మళ్లీ తన శరీరాన్నీ, మనస్సునీ నియంత్రించుకుని ముందుకు వచ్చారు. ‘‘బలం అనేది ఒక్కసారిగా రాదు.. అది ఓ ప్రయాణం. నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే నీవు ఎంత శక్తివంతుడివో తెలుస్తుంది’’ అంటూ తన ప్రయాణాన్ని వివరించారు.
ప్రస్తుతం సమంత మళ్లీ సినిమాలపైనా, తన ట్రాలాలా ప్రొడక్షన్ హౌస్‌పైనా దృష్టి పెట్టారు. ‘శుభం’ పేరుతో కొత్త టాలెంట్‌తో తీసిన తొలి చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. కొత్త కథలు, విభిన్నమైన కాన్సెప్ట్లతో ముందుకు సాగాలనే లక్ష్యంతో ట్రాలాలాను అభివృద్ధి చేస్తున్న సమంత, “సమాన పనికి సమాన వేతనం” అనే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నారు. నటిగా తిరిగి రాకపోయినా నిర్మాతగా ఆమె మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారనే చెప్పాలి.