Israel-Hamas War: యుద్దభూమిలోకి యుద్ధ నౌకలతో అమెరికా ఎంట్రీ
ఇజ్రాయెల్ , పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా రణరంగంలోకి దిగింది. ఇప్పటికే హమాస్‌పై ఆ దేశం తరఫున అమెరికా సైనికులు పోరాడుతుండగా
- By Praveen Aluthuru Published Date - 05:45 PM, Mon - 9 October 23
Israel-Hamas War: ఇజ్రాయెల్ , పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అగ్రరాజ్యం అమెరికా రణరంగంలోకి దిగింది. ఇప్పటికే హమాస్‌పై ఆ దేశం తరఫున అమెరికా సైనికులు పోరాడుతుండగా .. ఇప్పుడు అమెరికాకు చెందిన అధునాతన యుద్ధ నౌకలు రంగంలోకి దిగాయి. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశాల మేరకు ఆ దేశ సైన్యం ఇప్పటికే వాటిని ఇజ్రాయెల్‌కు అప్పగించింది. ఈ యుద్ధనౌకలు మధ్యధరా సముద్రం మీదుగా ఇజ్రాయెల్ చేరుకుంటాయని అధికారులు తెలిపారు.
ఈ నౌకలకు భూమి నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులను అమెరికా సరఫరా చేస్తోంది. దాడులను ముందుగానే పసిగట్టే అధునాతన పరికరం ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. తాజా ఘటన నేపథ్యంలో ఈ యుద్ధం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
ఈ యుద్ధం ద్వారా ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తే ఏం జరుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. వివిధ దేశాధినేతలు శాంతి చర్చలు మరియు సంఘర్షణను పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి (UNO) జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పాలస్తీనా హమాస్ మిలిటెంట్లు మరియు ఇజ్రాయెల్ పరస్పర రాకెట్ దాడుల్లో ఇప్పటికే వెయ్యి మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. వందల మంది గాయపడ్డారు.
https://twitter.com/i/status/1711308856700329999
Also Read: Rahu Time Period : ఆదివారం నుంచి శనివారం వరకు రాహుకాలం ఏ సమయంలో ఉంటుందో తెలుసా!