HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Do You Know What Time Rahu Period Is From Sunday To Saturday

Rahu Time Period : ఆదివారం నుంచి శనివారం వరకు రాహుకాలం ఏ స‌మ‌యంలో ఉంటుందో తెలుసా!

హిందూ గ్రంధాలలో రాహువును (Rahu) రాక్షస రూపంలో ఉన్న సర్పానికి అధిపతిగా భావిస్తారు. రాహువు తామస గుణం కలిగిన రాక్షసుడు.

  • Author : Vamsi Chowdary Korata Date : 09-10-2023 - 5:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Do You Know What Time Rahu Period Is..
Do You Know What Time Rahu Period Is..

Rahu Time Period : రాహు కాల సమయంలో మనం ఎలాంటి శుభకార్యాలు లేదా మంగళకరమైన పనులు చేయడం నిషిద్ధం. వారంలో 7 రోజులు అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు రాహుకాలం ఏ సమయంలో ఉంటుంది.?

హిందూ గ్రంధాలలో రాహువును (Rahu) రాక్షస రూపంలో ఉన్న సర్పానికి అధిపతిగా భావిస్తారు. రాహువు తామస గుణం కలిగిన రాక్షసుడు. సాధారణంగా మనం రాహు కాలాన్ని పగటిపూట గుర్తిస్తాం. ఇది జ్యోతిషశాస్త్రంలోను, హిందూ ధ‌ర్మంలోనూ అశుభమ‌ని పరిగణిస్తారు. దీని కారణంగానే రాహు కాలంలో ఎలాంటి శుభకార్యాలు లేదా పూజ కార్యక్రమాలు నిషేధించారు.

చాలా మంది ఏదైనా శుభకార్యానికి ఇంటి నుంచి బయలుదేరినప్పుడు లేదా మరేదైనా పనికి వెళుతున్నప్పుడు రాహు (Rahu) కాలాన్ని చూసుకుని బయలుదేరుతారు. ఎందుకంటే ఈ సమయంలో చేసే మంచి పనులు కూడా అశుభ ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రోజులో కొద్ది సమయం ఏవిధమైన శుభకార్యాలు చేయడం నిషిద్ధం. ఎందుకంటే రాహుకాలాన్ని అశుభంగా పరిగణిస్తారు. ఈ ముహూర్తంలో ఏ పని చేయడం కూడా మంచిది కాదు.

We’re now on WhatsApp. Click to Join.

రాహుకాలంలో చేసిన ఏ పనైనా సఫలం కానేకాదంటారు. లేదా ఆ వ్యక్తికి వివిధ రకాల సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందంటారు. అసలు మొత్తం రోజులో రాహుకాలం ఎప్పుడుంటుంది, రాహుకాలంలో ఏ పని చేయాలి, ఏది చేయకూడదనేది పరిశీలిద్దాం. రోజు మొత్తంలో రాహుకాలం ఉంటుంది. అందుకే రాహుకాలం ఎప్పుడనేది లెక్కిస్తుంటారు. రాహుకాలం ఏరోజుకా రోజు మారుతుంటుంది.

జ్యోతిష్యం ప్రకారం రాహుకాలానికి అధిపతి గ్రహం రాహువే (Rahu). అశుభ ఫలాల్ని అందిస్తుంటాడు. ప్రతిరోజూ ఓ గంటన్నర రాహుకాలముంటుంది. జ్యోతిష్యుల ప్రకారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో 8వ భాగం రాహుకాలంగా పరిగణిస్తారు. ఆదివారం నుంచి శనివారం వరకు రాహుకాలం ఏ సమయంలో ఉంటుందో తెలుసా? ఏ సమయాన్ని రాహుకాలంగా పరిగణిస్తారు..?

ఆదివారం నుంచి శనివారం వరకు రాహుకాలం (Rahu Time Period)..

ఆదివారం రాహు కాల సమయం:

రాహుకాలం ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:00 గంటల వరకు ఉంటుంది.

సోమవారం రాహు కాల సమయం:

సోమవారం రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9:00 గంటల వరకు ఉంటుంది

మంగళవారం రాహు కాల సమయం:

మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు ఉంటుంది.

బుధవారం రాహు కాల సమయం:

బుధవారం రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు ఉంటుంది

గురువారం రాహు కాల సమయం:

గురువారం రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు ఉంటుంది.

శుక్రవారం రాహు కాల సమయం:

శుక్రవారం రాహుకాలం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది

శనివారం రాహు కాల సమయం:

శనివారం రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు ఉంటుంది.

వారంలో 7 రోజులు ఈ సమయంలో రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో శుభ కార్యాలు లేదా మంగళ కార్యాలు చేయడం నిషిద్ధం. మీరు ఏదైనా పని చేయబోతున్నట్లయితే, నిపుణులైన జ్యోతిష్కులు లేదా పండితుల సలహా తీసుకొని పనిని ప్రారంభించండి.

Also Read:  Durga Temple EO : ద‌స‌రా ఉత్స‌వాల వేళ దుర్గ‌గుడి ఈవో బ‌దిలీ.. రాజ‌కీయ ఒత్తిళ్లే కార‌ణ‌మా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • god
  • Lord
  • rahu
  • Time Period

Related News

Why should a husband and wife stay apart during the month of Ashadha?

Ashada Masam 2026: ఆషాఢ మాసంలో భార్య భర్తలు ఎందుకు దూరంగా ఉండాలి?

హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు ఉండనుంది. ఈ మాసం రాగానే కొత్తగా పెళ్లైన దంపతులను ఒకరికొకరు దూరంగా ఉంచడం, వధువును పుట్టింటికి పంపించడం మన సమాజంలో తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే దీని వెనుక కేవలం సెంటిమెంట్లు, నమ్మకాలు మాత్రమే కాకుండా పూర్వీకులు ఆలోచించిన అద్భుతమైన వైజ్ఞానిక, సామాజిక కారణాలు దాగి ఉన్న

  • Why is *Thamboolam* (betel leaves and areca nuts) offered? On what occasions is it given? What is its significance?

    Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd