Nipah Virus: దేశంలో నిపా వైరస్ కలకలం.. 1998 నుంచి భారత్‌ను వదలని మహమ్మారి!
నిపా వైరస్ (NiV) మొదట 1998-99లో గుర్తించారు. భారతదేశంలో మొదటి కేసు 2001లో పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో నమోదైంది. ఆ తర్వాత 2007లో పశ్చిమ బెంగాల్‌లోని నదియాలో మరో కేసు నమోదైంది.
- By Gopichand Published Date - 03:01 PM, Mon - 14 July 25

Nipah Virus: భారతదేశంలో నిపా వైరస్ (Nipah Virus) ముప్పు మరోసారి పెరుగుతోంది. గత సంవత్సరంలాగే ఈ సారి కూడా కేరళలో ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు అక్కడ ఇద్దరు రోగులు మరణించారు. ఈ వైరస్ కేసులు 1998 నుంచి దాదాపు ప్రతి సంవత్సరం నమోదవుతున్నాయి. ప్రస్తుతం నిపా వైరస్ కేసులు కేరళలో కనిపిస్తున్నప్పటికీ భారతదేశంలో మొదటి కేసు పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో నమోదైంది. ఈ వైరస్ ఎక్కడ నుంచి ఉద్భవించింది? భారతదేశంలో మొదటి కేసు ఎప్పుడు వచ్చింది? ఈ వైరస్‌కు సంబంధించిన ప్రతి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
వైరస్ చరిత్ర ఏమిటి?
నిపా వైరస్ కొత్త వైరస్ కాదు. ఇది 1998 నుంచి ఉన్న వైరస్. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నివేదిక ప్రకారం.. ఈ వైరస్ మలేషియా, సింగపూర్‌లో మొదలైంది. సెప్టెంబర్ 1998 నుంచి మే 1999 వరకు ఈ వైరస్‌ను గుర్తించారు. ఆ సమయంలో 276 నిపా వైరస్ కేసులు నమోదయ్యాయి.
భారతదేశంలో మొదటి కేసు ఎప్పుడు గుర్తించారు?
నిపా వైరస్ (NiV) మొదట 1998-99లో గుర్తించారు. భారతదేశంలో మొదటి కేసు 2001లో పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో నమోదైంది. ఆ తర్వాత 2007లో పశ్చిమ బెంగాల్‌లోని నదియాలో మరో కేసు నమోదైంది.
నిపా వైరస్ లక్షణాలు ఏమిటి?
నిపా వైరస్ వ్యాప్తి కాలం 4 నుంచి 21 రోజుల వరకు ఉంటుంది. దీని ప్రారంభ లక్షణాలు సాధారణ జ్వరంలో కనిపించే వాటిలా ఉంటాయి. వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి, తేలికపాటి జ్వరం, కండరాల నొప్పి, దగ్గు, మూర్ఛలు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆఫ్రికాలో కనుగొనబడిన వైరస్ లక్షణాల్లో మెదడు వాపు కూడా కనిపించింది.
సిలిగురి రోగుల్లో ఏ లక్షణాలు కనిపించాయి?
భారతదేశంలో మొదటి కేసులు నమోదైనప్పుడు అనేక విభిన్న లక్షణాలు కనిపించాయి. నివేదిక ప్రకారం.. సిలిగురి రోగుల్లో అప్పట్లో 100 శాతం మందిలో జ్వరం కనిపించింది. తలనొప్పి, కండరాల నొప్పి 57 శాతం మందిలో, వాంతులు 19 శాతం మందిలో కనిపించాయి. కొన్ని శరీర భాగాల్లో మార్పులు కనిపించాయి. ఇందులో 97 శాతం కోమా లాంటి స్థితి, 51 శాతం శ్వాస సంబంధిత సమస్యలు, 43 శాతం శరీరంలో తిమ్మిరి ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
Also Read: Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు!
ఆఫ్రికన్ కోతుల మెదడులో ఈ వైరస్
ది జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రకారం.. బంగ్లాదేశ్‌లో నిపా వైరస్ కేసులు పెరగడాన్ని గమనించి, కొన్ని ఆఫ్రికన్ కోతులపై పరిశోధన జరిగింది. ఈ పరీక్షల కోసం కోతుల మెదడులపై ప్రయోగాలు చేయగా వైరస్ లక్షణాలు కనిపించాయి. ఇవి మానవులలో కనిపించిన లక్షణాలతో సమానంగా ఉన్నాయి.
వైరస్ దేని ద్వారా వ్యాపిస్తుంది?
ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన మూలాలు గబ్బిలాలు, గుర్రాలు, పందులు, కుక్కలు వంటి జంతువులు కావచ్చు. వీటితో ఎటాచ్‌మెంట్ వచ్చిన తర్వాత మానవులు కూడా ఈ వైరస్ బారిన పడవచ్చు. ఇది కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతుంది.
మానవులకు ఎలా వ్యాపిస్తుంది?
మొదట ఈ వైరస్ జంతువులలో వ్యాపిస్తుంది. వాటితో సంపర్కంలోకి వచ్చిన మానవులు కూడా దీని బారిన పడతారు. వైరస్ సోకిన గబ్బిలాలు, గుర్రాలు లేదా పందులు తాకిన పండ్లను తినడం ద్వారా మానవులలో వ్యాపిస్తుంది. ఉదాహరణకు గబ్బిలాలు చెట్లపై ఉంటాయి. అలాంటి చెట్లపై ఉన్న పండ్లపైకి ఈ వ్యాధి చేరుతుంది. ఆ పండ్లను మానవులు తినడం ద్వారా వైరస్ వారిలోకి చేరుతుంది. ఈ విధంగా ఇది మానవుల నుంచి మరో మానవునికి వ్యాపిస్తుంది.
వైరస్ నుంచి ఎలా రక్షణ పొందాలి?
ఈ వైరస్ నుంచి రక్షణ పొందడానికి ఆరోగ్య నిపుణులు అనేక మార్గాలు సూచించారు. అత్యంత ముఖ్యమైనది శుభ్రతపై శ్రద్ధ వహించడం. వైరస్ నుంచి రక్షణ పొందాలంటే ఏదైనా జంతువుతో సంపర్కంలోకి వచ్చిన తర్వాత చేతులను తప్పనిసరిగా కడుక్కోవాలి. పండ్లు తినేముందు వాటిని బాగా కడగాలి. నేలపై పడిన అర్ధం పక్వానికి వచ్చిన పండ్లను తినకుండా ఉండమని సూచించారు. గ్రామాల్లో బావులు ఉంటాయి. అవి కొన్నిసార్లు ఖాళీగా ఉంటాయి. అలాంటి బావుల నీళ్లు లేదా ఈతకు వెళ్లకూడదని చెబుతున్నారు.