సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం పై సస్పెన్స్
- Author : Vamsi Chowdary Korata
Date : 09-05-2026 - 9:53 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళనాడులో మరో బిగ్ ట్విస్ట్. టీవీకే అధినేత విజయ్ 118 మంది ఎమ్మెల్యేలతో కూడిన జాబితాను గవర్నర్‌కు అందజేశారని, దీంతో రేపు ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారని టీవీకే, వామపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని టీవీకే, వామపక్షాల నాయకులు ప్రకటించారు. కానీ విజయ్‌ని రేపు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదని లోక్ భవన్ వర్గాలు తెలిపాయి.
టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు పలికాయి. రెండేసి స్థానాలు గెలుచుకున్న వీసీకే, ఐయూఎంఎల్ కూడా మద్దతు ఇస్తామని తెలిపాయి. కానీ గవర్నర్‌కు మద్దతు లేఖను ఈ పార్టీలు అందించలేదు. దీంతో ప్రమాణ స్వీకార అంశం మళ్లీ మొదటికి వచ్చి, సస్పెన్స్ కొనసాగుతోంది.
విజయ్ ఈరోజు సాయంత్రం మూడోసారి గవర్నర్‌ను కలిసి తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను అందజేశారు. విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే కాంగ్రెస్ గవర్నర్‌కు లేఖను అందజేసింది. ఈరోజు వామపక్షాలు కూడా మద్దతు లేఖను అందించాయి. వీఎంసీ, ఐయూఎంఎల్ మద్దతు ప్రకటించాయి. కానీ గవర్నర్‌కు లేఖను అందజేయలేదు. లేఖ అందజేయడంపై రేపు నిర్ణయిస్తామని వీసీకే తెలిపింది. మరోవైపు, టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వబోవడం లేదని తాజాగా ఐయూఎంఎల్ ప్రకటన విడుదల చేసింది.
చివరి నిమిషంలో వీసీకే, ఐయూఎంఎల్ చేయివ్వడంతో, ఎమ్మెల్యేల బలం 116 వద్ద ఆగిపోయింది. టీవీకే 107, కాంగ్రెస్ 5, వామపక్షాలు 4 సీట్లు విజయ్‌కి పూర్తి మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో, విజయ్‌ని రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించలేదని లోక్ భవన్ వర్గాలు తెలిపాయి.