Tvk విజయ్‌కి మళ్లీ షాకిచ్చిన గవర్నర్..
- Author : Vamsi Chowdary Korata
Date : 09-05-2026 - 9:27 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇచ్చినట్లే కనిపించినా.. చివరి నిమిషంలో విజయ్‌కి గవర్నర్ షాక్ ఇచ్చారు. దీంతో నేడు విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొంది. వీసీకే పార్టీ నుంచి మద్దతు లేఖ రాకపోవడంతో పాటు.. ఐయూఎంఎల్ పార్టీ లేఖలో స్పష్టత లేకపోవడంతో.. ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అధికారికంగా ఆమోదం తెలపలేదు. దీంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వీడటం లేదు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ కటాక్షం కోసం ఎదురు చూసిన సంగతి తెలిసిందే. బుధవారం టీవీకే ప్రతినిధులతో కలిసి గవర్నర్‌ను కలిసిన విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీని ఆహ్వానించాలని కోరారు. అయినా సరే, గవర్నర్ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో గురువారం, శుక్రవారం మరోసారి విజయ్ లోక్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించాలని అభ్యర్థించారు. అయినా సరే, గవర్నర్ నుంచి సానుకూల స్పందన రాలేదు. మ్యాజిక్ ఫిగర్ కావాలని గవర్నర్ సూచించడంతో విజయ్ పార్టీ ప్రతినిధులు వామపక్షాలు, వీసీకేను ఒప్పించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చినట్లే కనిపించినా.. చివరి నిమిషంలో విజయ్‌కి గవర్నర్ షాకిచ్చారు. దీంతో నేటి విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొంది.