Delimitation : దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఇలా ప్రతీకారం తీర్చుకుంటుంది – వైస్ షర్మిల
Delimitation : దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి తగినంత ప్రజాదరణ లేనందున, పార్లమెంటులో దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ఈ యాజమాన్య మార్పులను అమలు చేయాలని చూస్తోందని ఆరోపించారు
- By Sudheer Published Date - 07:23 PM, Thu - 13 March 25

డీలిమిటేషన్ (Delimitation ) అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో (Southern States), జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేస్తే, తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో బీజేపీ(BJP)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila ) దీనిపై స్పందిస్తూ.. బీజేపీదీ పూర్తిగా ప్రతీకార చర్యగా అభివర్ణించారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి తగినంత ప్రజాదరణ లేనందున, పార్లమెంటులో దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ఈ యాజమాన్య మార్పులను అమలు చేయాలని చూస్తోందని ఆరోపించారు.
Telangana Rising : తెలంగాణ రైజింగ్‌కు కేంద్ర మద్దతు కోరిన సీఎం రేవంత్ రెడ్డి
గత కొన్నేళ్లుగా దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ విధానాన్ని కచ్చితంగా పాటించడంతో జనాభా పెరుగుదల పరిమితమైందని, కానీ ఉత్తర భారతదేశంలో జనాభా పెరుగుదల అధికంగా ఉందని తెలిపారు. దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాలకు అదనపు పార్లమెంటరీ స్థానాలు లభిస్తుండగా, దక్షిణాదికి మాత్రం కేవలం కొద్దిమంది సభ్యులే పెరుగుతారని ఆమె వివరించారు. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో స్థానాల సంఖ్య గణనీయంగా పెరగడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కేవలం 12 స్థానాలు మాత్రమే పెరగడం అన్యాయమని షర్మిల పేర్కొన్నారు.
Nara Lokesh : గుంజీలు తీసిన హెడ్‌మాస్టర్ ను ప్రశంసించిన లోకేష్..ఎందుకంటే..!
ఈ డీలిమిటేషన్ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదని, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పక్షాలతో చర్చించాల్సిన అవసరం ఉందని షర్మిల డిమాండ్ చేశారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నేతలు దీనిపై తగిన స్పందన ఇవ్వాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu ) దీనిపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని కోరారు. బీజేపీతో పొత్తు కారణంగా చంద్రబాబు మౌనం వహిస్తే, భవిష్యత్తులో దాని భయానక పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. డీలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగేలా చూడాలని షర్మిల స్పష్టం చేశారు.