Telangana Rising : తెలంగాణ రైజింగ్‌కు కేంద్ర మద్దతు కోరిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Rising : రాబోయే 25 సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వ లక్ష్యాలు, ఈ క్రమంలో కేంద్ర సహకారం ఎంతో అవసరమని సీఎం వివరించారు
- By Sudheer Published Date - 06:54 PM, Thu - 13 March 25

తెలంగాణ(Telangana)ను ప్రగతి పథంలో నిలిపేందుకు, అభివృద్ధి కార్యక్రమాలకు మరింత మద్దతుగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanyam Jaishankar)ను కలిసి విజ్ఞప్తి చేశారు. హైదరాబాదును అంతర్జాతీయ వేదికగా మార్చేందుకు చేపట్టిన ప్రాజెక్టులు, రాబోయే 25 సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వ లక్ష్యాలు, ఈ క్రమంలో కేంద్ర సహకారం ఎంతో అవసరమని సీఎం వివరించారు. ముఖ్యంగా 2025లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న మిస్ వరల్డ్, గ్లోబల్ డీప్ టెక్ సదస్సు, భారత్ సమ్మిట్, యానిమేషన్-గేమింగ్, వీఎఫ్ఎక్స్ తదితర అంతర్జాతీయ ఈవెంట్ల గురించి మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు.
Sanjay Shah : తన వ్యక్తిగత వాటా నుండి ప్రూడెంట్ షేర్లను బహుమతిగా ఇస్తోన్న శ్రీ సంజయ్ షా
తెలంగాణ రైజింగ్‌ను ప్రపంచ స్థాయిలో ప్రోత్సహించేందుకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను విదేశాల్లో కూడా ప్రచారం చేయాలనీ, దౌత్యపరమైన సహాయంతో పాటు లాజిస్టిక్స్ పరంగా కూడా కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తోందని, ముఖ్యంగా హైదరాబాద్ నగరం అంతర్జాతీయ వేదికలతో పాటు పెట్టుబడులకు అనుకూలంగా మారుతుందని ఆయన తెలియజేశారు.
KTR : జగదీశ్‌రెడ్డి సస్పెండ్.. భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకుంటారు: కేటీఆర్
కేంద్ర మంత్రి జైశంకర్ తెలంగాణ అభివృద్ధిని ప్రశంసిస్తూ, హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా ఎదుగుతోందని, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు పూర్తి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, అంతర్జాతీయ సదస్సుల విజయవంతమైన నిర్వహణకు కేంద్ర సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, నాగర్ కర్నూల్, భువనగిరి ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.