Nara Lokesh : గుంజీలు తీసిన హెడ్‌మాస్టర్ ను ప్రశంసించిన లోకేష్..ఎందుకంటే..!
Nara Lokesh : మామూలుగా విద్యార్థులు తప్పు చేస్తే ఉపాధ్యాయులు దండన విధిస్తారు. కానీ ఇక్కడ విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని పాఠాలు వినడంలేదని ఓ ప్రధానోపాధ్యాయుడు తనకు తానే శిక్ష విధించుకున్నారు
- By Sudheer Published Date - 07:08 PM, Thu - 13 March 25

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ హైస్కూల్(ZP High School)లో విద్యార్థుల చదువు పురోగతి అంతంత మాత్రంగా ఉండడంతో, వారికి క్రమశిక్షణ నేర్పే విధంగా హెడ్‌మాస్టర్ చింత రమణ (Headmaster Chintha Ramana) తీసుకున్న వినూత్న చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Mlc Seats : తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం
మామూలుగా విద్యార్థులు తప్పు చేస్తే ఉపాధ్యాయులు దండన విధిస్తారు. కానీ ఇక్కడ విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని పాఠాలు వినడంలేదని ఓ ప్రధానోపాధ్యాయుడు తనకు తానే శిక్ష విధించుకున్నారు. విద్యార్థులకు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. విద్యార్థులను శారీరకంగా శిక్షించకుండా, వారిని సున్నితంగా బోధించాలని భావించి, తానే స్వయంగా గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారం చేసి విద్యార్థులకు పాఠం చెప్పాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఎక్స్ వేదికగా స్పందించి, హెడ్‌మాస్టర్ తీసుకున్న ఆలోచనను అభినందించారు.
Ola Electric Holi Flash Sale: హోలీ సందర్భంగా ఓలా ఫ్లాష్ సేల్.. రూ. 26,750 తగ్గింపు!
మంత్రి నారా లోకేష్.. ఈ చర్యను ఒక మంచి మార్గంగా ప్రశంసిస్తూ, విద్యార్థులను శిక్షించడం కాకుండా వారిలో చైతన్యం తీసుకురావడం ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కలిసి కృషి చేయాలని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని కోరారు. హెడ్‌మాస్టర్ చింత రమణకు అభినందనలు తెలుపుతూ వారి చర్య ద్వారా విద్యార్థుల్లో మార్పు రావాలని ఆకాంక్షించారు.
హెడ్‌మాస్టర్ రమణ స్పందిస్తూ.. ప్రస్తుత విద్యావ్యవస్థలో శిక్షించడానికి లేదా గట్టిగా మందలించడానికి తామేమీ చేయలేమని, విద్యార్థులు మారకపోతే తాము సహాయహస్తం అందించలేని స్థితికి చేరుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తు మెరుగుపడేందుకు తాము చేసే ప్రయత్నాలను నొక్కి చెప్పారు. విద్యార్థుల ప్రగతికి అందరూ సమష్టిగా కృషి చేయాలన్న ఆయన అభిప్రాయాన్ని మంత్రిగారు సమర్థించడం, విద్యా రంగంలో కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరాన్ని నొక్కి చూపుతోంది.
విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ చింత రమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంతమాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదని….విద్యార్థులను దండించకుండా, గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. హెడ్మాస్టరు గారూ!… pic.twitter.com/Se7zu6uwf5
— Lokesh Nara (@naralokesh) March 13, 2025