Tulsi Plant : తులసి పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ విషయాలు అస్సలు మర్చిపోకండి?
తులసి మొక్కలు (Tulsi Plant) లక్ష్మీదేవి విష్ణువు ఇద్దరూ కొలువై ఉంటారని కాబట్టి తులసిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీ విష్ణువు తులసి ముగ్గురి అనుగ్రహం కలుగుతుందని భావిస్తూ ఉంటారు.
- Author : Vamsi Chowdary Korata
Date : 27-01-2024 - 4:38 IST
Published By : Hashtagu Telugu Desk
Tulsi Plant : హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావించడంతో పాటు భక్తి శ్రద్ధలతో పూజలు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా తులసి మొక్క విషయంలో ఎన్నో రకాల విషయాలను పాటిస్తూ ఉంటారు. తులసి మొక్కలు (Tulsi Plant) లక్ష్మీదేవి విష్ణువు ఇద్దరూ కొలువై ఉంటారని కాబట్టి తులసిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీ విష్ణువు తులసి ముగ్గురి అనుగ్రహం కలుగుతుందని భావిస్తూ ఉంటారు. తులసి మొక్కలు (Tulsi Plant) పూజలు చేయడం వల్ల ఆ ఇంట సుఖ శాంతులు కలుగుతాయని నమ్మకం. తులసి మొక్కకు రోజూ క్రమం తప్పకుండా పూజలు చేయడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే తులసి మొక్కకు పూజ చేసేటప్పుడు కొన్ని రకాల విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇంతకీ ఆ విషయాలు ఏంటి అన్న విషయానికొస్తే.. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిరోజూ సాయంత్రం తులసి మొక్క ఎదుట ఆవు నెయ్యితో చేసిన దీపాన్ని వెలిగించాలి. అయితే మీరు వెలిగించే ప్రమిదకు కాస్త పసుపు కూడా రాయడం మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అంతేకాకుండా మీకు జీవితంలో మంచి లాభాలు వస్తాయి. అదేవిధంగా తులసి మొక్క దగ్గర పిండితో చేసిన దీపాన్ని వెలిగించాలి. ఆ మరుసటి రోజు దానిని ఆవుకు తినిపించాలి.
ఇలా చేయడం వల్ల శుభఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవి, అన్నపూర్ణ దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ప్రతిరోజూ సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి, స్నానం చేసిన అనంతరం తులసి చెట్టుకు నీటిని సమర్పించాలి. తులసి చెట్టుకు పూజ చేసే సమయంలో ఉతికిన బట్టలనే ధరించాలి. ఎల్లప్పుడూ తులసి మొక్క కిందే దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మీ జీవితంలో ధనానికి లోటు అనేదే ఉండదు. మత గ్రంథాల ప్రకారం తులసి చెట్టుకు ఆదివారం, ఏకాదశి రోజున నీళ్లు సమర్పించకూడదు. అంతేకాదు ఆ రోజున తులసి ఆకులను తెంచకూడదు.
Also Read: Vamu : తొందరగా బరువు తగ్గాలని అనుకుంటున్నారా.. అయితే వాముతో చేయాల్సిందే?