HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Sleep During Pregnancy Follow These Tips

Pregnancy and Sleep: ఆ సమయాల్లో నిద్రపట్టడం లేదా..?

అమ్మా అనే పిలుపు వినాలంటే...ఈ సమయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొవల్సిందే.

  • Author : Hashtag U Date : 02-05-2022 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sleep Pregnancy Imresizer
Sleep Pregnancy Imresizer

అమ్మా అనే పిలుపు వినాలంటే…ఈ సమయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొవల్సిందే. నెలలు నిండుతున్నా కొద్దీ నిద్ర పట్టకపోవడం కూడా వీటిలో ఒకటి. అయితే లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే..ఈ సమస్య నుంచి బయటపడటం అంత కష్టం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో ఓసారి తెలుసుకుందాం.

సాయంతంలోపే పడుకోవాలి…
ప్రెగ్నెన్సీ సమయంలో ఎదురయ్యే ముఖ్యమైన సమస్యల్లో ఒకటి రాత్రి పూట ఎక్కువగా బాత్ రూంకు వెళ్లాల్సి రావడం. అందుకే మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగాలి. సాయంత్రం నుంచి రాత్రి వరకు కాస్త తక్కువ నీళ్లు తాగుతే సరిపోతుంది. దీనివల్ల రాత్రిపూట మధ్యలో బాత్ రూం కోసం పదే పదే మేలుకోవల్సిన అవసరం రాకుండా ఉంటుంది.

వ్యాయామం….
గర్భవతిగా ఉన్న సమయంలో ఏ పనీచేయకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు చాలామంది. అది మంచిది కాదు. వైద్యులు ప్రత్యేకంగా సూచిస్తే తప్ప పూర్తి విశ్రాంతి తీసుకోకూడదు. తేలికపాటి వ్యాయామం చేసినట్లయితే…మీకూ…మీ కడుపులోకి బిడ్డకు చాలా మంచిది. దీంతో మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. రాత్రి కూడా హాయిగా నిద్రపోతారు. అయితే పడుకోవాడానికి నాలుగు గంటల ముందు ఎక్సర్ సైజ్ చేయకపోవడమే మంచిది. రోజూ వ్యాయామం చేసే సమయాన్ని కూడా గమనించాలి. ఎక్కువ సేపు కూడా చేయకూడదు. వ్యాయామం ఎలాంటిదైనా సరే వైద్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి.

ఒత్తిడికి దూరంగా..
ఆందోళన, ఒత్తిడి ఉన్నట్లయితే…రాత్రి నిద్రపాు చేస్తుంది. ఇంట్లో కానీ ఆఫీసులోకానీ సమస్యలు డెలివరీ గురించి ఉండే భయాలు ఇలా ఏవైనా కావచ్చు. వాటి గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురై నిద్రపోనట్లయితే…మీ బిడ్డ మెదడుపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అందుకే ఒత్తిడికి దూరంగా ఉండాలి.

సమయానికి అనుగుణంగా…
రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకున్నట్లయితే నిద్రపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పడుకునే ముందు టీవీ చూడటం…మొబైల్ మాట్లాడటం…కంప్యూటర్ వంటివి ఉపయోగించరాదు. కనీసం పడుకునే సమయానికి అరగంట ముందే ఇవన్నీ కూడా ఆపేయడం మంచిది. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, గోరువెచ్చని పాలు తాగడం చేస్తే…చక్కటి ఫలితాలు ఉంటాయి. సుఖంగా నిద్ర పడుతుంది.

రాత్రి నిద్రపోయే ముందు తలను కాళ్లను సున్నితంగా మసాజ్ చేసుకున్నట్లయితే నరాలు ఉత్తేజితం అవుతాయి. దీంతో నిద్ర బాగా పడుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health
  • Life Style
  • pregnancy
  • sleep
  • stress

Related News

Gut Health

Gut Health: పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.. తినాల్సిన ఫుడ్స్

Gut Health మన పేగులు ఆహారాన్ని జీర్ణం చేయడంలో సాయపడటమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీర శక్తిని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన గట్ హెల్తీ లైఫ్‌స్టైల్‌కు సంకేతం. అయితే, కొన్నిసార్లు పేలవమైన ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి పేగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే సరైన పోషకాహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన పేగును

  • Asia Book Of Records

    Asia Book of Records : ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో డానోన్ ఇండియా

  • Fatty Liver Stages

    Fatty Liver: సన్నగా ఉన్నవారిలో కనిపించే ఫ్యాటీ లివర్ గురించి నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలివే!

Latest News

  • Vizag : ప్రియురాలిని చంపి, ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన ప్రేమికుడు

  • Prakash Raj : ప్రకాశ్ రాజ్ ఇంట విషాదఛాయలు

  • Azharuddin: ఎల్బీ స్టేడియంలో సిక్సులతో చెలరేగిన మంత్రి అజారుద్దీన్..

  • PSL Ball Tampering: పాకిస్థాన్ క్రికెట్‌లో మరో వివాదం.. అడ్డంగా దొరికిపోయిన స్టార్ ప్లేయర్లు..

  • Stock Markets: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd