HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Former Mp Vijayasai Reddy Files Petition In High Court Regarding Amaravati Capital

Vijayasai Reddy: అమరావతి రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హైకోర్టులో పిటిషన్

  • Author : Vamsi Chowdary Korata Date : 03-07-2026 - 3:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Former MP Vijayasai Reddy files petition in High Court regarding Amaravati capital.
Former MP Vijayasai Reddy files petition in High Court regarding Amaravati capital.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రమైన ఆరోపణలతో ముందుకొచ్చారు. టీడీపీ ‘అమరావతి’ అంటుంటే, వైసీపీ ‘మావిగన్’ అనడం వంటి అర్థరహిత వాదనలను పక్కనపెట్టి, రాజధాని పేరుతో జరుగుతున్న భారీ అవినీతిపై దృష్టి సారించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అమరావతి నిర్మాణం పేరుతో సుమారు రూ.15,000 కోట్ల అవినీతికి పథకం రచించారని, ఈ అవినీతి యజ్ఞంపై పూర్తి ఆధారాలతో త్వరలోనే కోర్టును ఆశ్రయిస్తానని ఆయన సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

ఒక బాధ్యతగల పౌరుడిగా తన అభిప్రాయాలను పంచుకుంటున్నానంటూ విజయసాయి రెడ్డి పలు కీలక ప్రశ్నలను సంధించారు. “రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు గడిచినా ఇంకా రాజధాని ఎక్కడో తేల్చకుండా చర్చించడం అందరూ సిగ్గుపడాల్సిన విషయం కాదా? 2029 ఎన్నికల్లో కూడా రాజధాని ఎక్కడ ఉండాలో ప్రజలే నిర్ణయించాలా? ఈ రాజకీయ చదరంగానికి అన్ని పార్టీలు బాధ్యత వహించవద్దా?” అని ఆయన నిలదీశారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఎందుకు పక్కనపెట్టారని ఆయన ప్రశ్నించారు.+

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి మాత్రమే అని టీడీపీ; కాదు మావిగన్‌ అని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ; రెండు రాజకీయపార్టీలు చేస్తున్న భిన్న అర్థరహిత వాదనలు చూసిన తరవాత, బాధ్యత గల ఒక పౌరుడిగా నా అభిప్రాయాలు ప్రజలతో పంచుకుంటున్నాను.

1) రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి అన్న అంశం మీద…

— Vijayasai Reddy V (@VSReddy_MP) July 3, 2026

అమరావతి నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని ఆయన వివరంగా ఆరోపించారు. “ప్రస్తుత ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం రూ.50,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రతి నిర్మాణంలోనూ అంచనాలను భారీగా పెంచి చూపారు. ఇది ‘దేవతల నగరం’ అనే బ్రాండింగ్‌తో సాగుతున్న అతిపెద్ద అవినీతి పథకం. అధికారంలో ఉన్నవారు 25 నుంచి 30 శాతం వరకు కమీషన్లుగా దండుకుంటున్నారు. అంటే ఇది సుమారు రూ.15,000 కోట్ల లంచాల స్కామ్. అసలు అమరేశ్వర ఆలయం, బుద్ధుని విగ్రహం ఉన్న ప్రాంతానికి, ఇప్పుడు భవనాలు కడుతున్న ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ అమరావతి పుణ్యక్షేత్రం అయితే, ఈ అమరావతి అవినీతి ప్రవహించే క్షేత్రం” అని ఆయన తీవ్రంగా విమర్శించారు.

మొదటి దశ భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ ప్లాట్లు కేటాయించకపోవడాన్ని ఎలా సమర్ధించుకుంటారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధాని కోసం లక్ష ఎకరాలతో ఏం చేస్తారని నిలదీశారు. విభజన చట్టంలోనే వీజీటీఎం (విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి) అభివృద్ధి ప్రస్తావన ఉన్నప్పుడు, ఆ ప్రాంతమంతా రాజధాని భవనాలను విస్తరిస్తే నష్టమేమిటని ఆయన సూచించారు. వైసీపీ ‘మావిగన్’ అనడం వల్ల ప్రయోజనమేంటని, ఇప్పటికే పూర్తయిన నిర్మాణాల గతేంటని ఆయన ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం అంటే పార్టీలు కమీషన్లు దండుకోవడం కాదని హితవు పలికారు.

అమరావతి పేరుతో జరుగుతున్న ఈ అవినీతిపై ఎస్కలేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో, ప్రజాపక్షాన త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amaravati capital
  • Andhra Pradesh Capital
  • Former MP Vijayasai Reddy

Related News

Capital war reignites in AP... Amaravati versus Mavigan...

Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

ఏపీలో మావిగన్ గురించి చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పనుల్లో వేగం పెంచడానికి ప్రయత్నిస్తుండగా.. జగన్ మాత్రం మావిగన్ పేరిట మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి రాజధాని నిర్మిస్తే బాగుంటుందని చెబుతున్నారు. మొదట జగన్ నోటి నుంచి ‘మావిగన్’ అనే మాట వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. కానీ జులై 1న నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జగన్ మాట్లాడ

  • Somireddy Chandramohan Reddy lashes out at YCP chief Jagan.

    Somireddy Chandramohan Reddy: వైసీపీ అధినేత జగన్ పై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్

  • Mavigan vs. Amaravati in the upcoming elections... YS Jagan's challenge!

    Amaravati Vs MAVIGUN: వ‌చ్చే ఎన్నిక‌ల్లో మావిగన్ వర్సెస్ అమరావతి.. వైఎస్‌ జగన్‌ సవాల్..!

  • Capital region farmers obstructed the visit of YCP leaders.

    Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

Latest News

  • Almond Oil: ప్రకాశవంతమైన చర్మం, ఒత్తైన జుట్టు మీ సొంతం కావాలంటే ఆ నూనె ఉపయోగించాల్సిందే!

  • Ayatollah Ali Khamenei: ఖమేనీ అంత్యక్రియలు మోసల్లా మసీదుకు తరలింపు

  • Vijayasai Reddy: అమరావతి రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హైకోర్టులో పిటిషన్

  • Bhatti Vikramarka: తెలంగాణ అప్పు అక్షరాలా రూ.8.21 లక్షల కోట్లు.. బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క ఫైర్

  • Weight Loss: బరువు పెరుగుతున్నారా? అయితే ఆలస్యం చేయకుండా వీటిని ప్రయత్నించండి..!

Trending News

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd