Chillies Tips: ఈ టిప్స్ పాటిస్తే వేసవిలో మిర్చి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
పచ్చిమిర్చి లేకుండా వంట పూర్తి కాదు. అయితే, సమ్మర్‌లో పచ్చిమిర్చి త్వరగా వడిలిపోతూ ఉంటాయి. ఈ సీజన్‌లో కొన్ని టిప్స్ ఫాలో అయితే..
- By Maheswara Rao Nadella Published Date - 06:00 PM, Tue - 7 March 23

వేసవి కాలం మొదలైంది. ఈ సీజన్ స్టార్ట్ అయ్యిందంటే చాలు.. కూరగాయలు త్వరగా పాడైపోతూ ఉంటాయి. ఉదయం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కూరగాయలు కూడా.. సాయంత్రానికి వడిలిపోతూ ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టినా కానీ, ఫ్రెష్‌గా ఉండవు. వాటిలో పచ్చిమిర్చి (Green Chillies) కూడా ఒకటి. పచ్చిమిర్చి లేకుండా ఏ వంట కూడా పూర్తి కాదు. అందుకే.. చాలా మంది వారం, పదిరోజులకు సరిపడా పచ్చిమిర్చి కొనేస్తూ ఉంటారు. కొన్నిసార్లు తక్కువ రేటుకు వస్తుందని ఎక్కువగా కొంటూ ఉంటారు. కానీ, వేసవికాలంలో పచ్చిమిర్చి త్వరగా వడలిపోతూ ఉంటాయి. కొన్ని రోజులకు పచ్చిమిర్చి కాస్త.. ఎండిపోతూ ఉంటాయి. ఈ కాలంలో పచ్చిమిర్చిని స్టోర్ చేసేప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే.. పచ్చిమిర్చి ఫ్రెష్‌గా ఉంటాయి.
వారం నుంచి 2 వారాలు నిల్వ ఉండాలంటే:
మీరు పచ్చిమిర్చిని కొన్ని వారాల పాడు ఫ్రెష్‌గా ఉంచుకోవాలంటే.. జిప్ లాక్ బ్యాగ్‌లో ఉంచడం ఉత్తమమైన మార్గం. మీ జిప్ లాక్ బ్యాగ్ స్టోర్ చేయడానికి ముందు, మిరప కాయల తొడిమలు తీయండి. తొడిమలు తీసిన పచ్చిమిర్చిని జిప్‌లాక్ బ్యాగ్ వేసి రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. మీరు అవసరమైనప్పుడు.. తీసి వాడుకోవచ్చు.
నెలపాటు నిల్వ ఉండాలంటే:
పచ్చిమిర్చి (Green Chillies) నెలపాటు నిల్వ ఉంచాలంటే.. వాటిని శుభ్రంగా కడగాలి. చెడిపోయిన మిర్చీని బయటపారేయాలి. ఇవి, మిగిలిన మిరపకాయలనూ పాడు చేస్తాయి. వీటిని పేపర్ టవల్‌పై ఆరబెట్టండి. పచ్చిమిర్చి తొడిమలు తీసి, గాలి చొరబడని డబ్బాలో పేపర్ టవల్ వేసి, పైన పచ్చిమిర్చి వేయాలి. దానిపై మళ్లీ పేపర్ టవల్ లేయర్ వేయండి. ఇప్పుడు మూతపెట్టి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచండి. ఇలా చేస్తే మిర్చీ నెలపాటు పాడవ్వకుండా ఉంటాయి.
సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే:
పేస్ట్ కూడా స్టోర్ చేసుకోవచ్చు:
పచ్చి మిరపకాయల తొడిమలు తీసి, వాటిని శుభ్రం చేయండి. వీటిని పేపర్‌టవల్‌పై ఆరబెట్టండి. మిర్చీపై నీళ్లు ఆరిన తర్వాత.. మిక్సీలో నీళ్లు వేయకుండా.. పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్‌ను శుభ్రమైన డబ్బలో తీసుకుని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోండి. ఈ పేస్ట్ కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది. మీరు పచ్చళ్లలో, పులుసులలో ఈ పేస్ట్ వాడుకోవచ్చు.
Also Read: Potatoes: బంగాళాదుంపలతో మీ బరువును అదుపులో ఉంచుకోవచ్చు ఇలా.

Related News

Healthy Sleep Tips: 8 గంటల కంటే తక్కువ నిద్రపోతే PAD ముప్పు.. ఏమిటది..?
8 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి (PAD) వచ్చే ప్రమాదం ఉంటుందని స్వీడన్‌లో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.