Potatoes: బంగాళాదుంపలతో మీ బరువును అదుపులో ఉంచుకోవచ్చు ఇలా.
బంగాళదుంపలు.. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే, వీటిని తింటే బరువు పెరుగుతారని అంటారు. అసలు ఇందులో నిజం ఎంతుందో చూద్దాం.
- By Maheswara Rao Nadella Published Date - 09:00 PM, Mon - 6 March 23

బంగాళాదుంపలు (Potatoes) అనగానే అది టేస్టీ ఫుడ్ ఐటెమ్ అనుకుంటారే తప్పా ఎప్పుడు కూడా హల్దీ అనరు. కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల దీని తింటే బరువు పెరుగతారనుకుంటారు. కానీ, కార్బ్స్ కూడా కొంతవరకు మంచివే ఆరోగ్యానికి వీటిని మొత్తం డైట్ నుంచి తీసేయొద్దు. కొద్దిగా తీసుకునేలా చూడాలి. అప్పుడే బరువు తగ్గడం ఈజీ అవుతుంది. దీని వల్ల ఎలాంటి నష్టాలు ఉండవు. సరైన తీరుగా వండండి, సరైన తీరులోనే తినడం వల్ల బరువు పెరగరు.
ఎలా వండినా..
బంగాళాదుంపలు (Potatoes) ఎలా వండినా బావుంటాయి. పిల్లలు, పెద్దలు ఎక్కువగా వీటిని తీసుకుంటారు. పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఈ ఆలుగడ్డల్ని తింటే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. ఎక్కువగా తినలేరు.
పోషకాలు:
ఆలుగడ్డలు పాన్‌కేక్:
తక్కువ ఆయిల్‌తో:
ముందుగా బంగాళాదుంపల్ని కడగండి. వాటిని ఫోర్క్‌తో గుచ్చండి. 3 నిమిషాల పాటు ఉడికించండి. తర్వత బేకింగ్ పాన్‌లో వేయండి. మీకు నచ్చిన కూరగాయలు వేయండి. కొద్దిగా ఆలివ్ ఆయిల్, ఉప్పు, పెప్పర్ పౌడర్ వేయండి. పై నుంచి కొద్దిగా మీకు నచ్చిన మసాలా పౌడర్స్ వేసి సిమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. ఆ తర్వాత తినడమే.
సలాడ్:
ముందుగా, ఆలుగడ్డల్ని ఉడకబెట్టి చిన్న ముక్కలుగా కట్ చేయండి. దానికి ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, వెల్లుల్లి పొడి, ఉప్పు, మిరియాల పొడి వేయండి. మీరు దీనికి స్ప్రింగ్ ఆనియన్స్, దోసకాయలు కూడా వేయొచ్చు. వీటన్నింటిని మిక్స్ చేసి కాసేపు పక్కన పెట్టండి. డ్రెస్సింగ్ కోసం క్రీమ్, మస్టర్డ్ సాస్, ఉప్పు, బ్లాక్ పెప్పర్, పాలు కలిపి తీసుకోండి. సలాడ్‌కి డ్రెస్సింగ్ జోడించండి. కొత్తిమీరతో తరుగు గార్నిష్ చేయండి.
Also Read: Holi: హోలీ రోజున 5 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి

Related News

Healthy Sleep Tips: 8 గంటల కంటే తక్కువ నిద్రపోతే PAD ముప్పు.. ఏమిటది..?
8 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి (PAD) వచ్చే ప్రమాదం ఉంటుందని స్వీడన్‌లో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.