HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Eating Papaya Seeds Daily Reduces Cholesterol And Cancer Risk

Papaya Seeds: బొప్పాయి గింజలు రోజూ తింటే కొలెస్ట్రాల్‌, క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుంది

  • Author : Maheswara Rao Nadella Date : 25-02-2023 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Papaya For Breakfast
Papaya For Breakfast

హెల్తీ ఫ్రూట్స్‌ లిస్ట్‌లో మొదట ఉండే పండ్లలో బొప్పాయి (Papaya) ఒకటి. ఈ పండు తరచుగా తీసుకుంటే, మన శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది. బొప్పాయిలో విటమిన్‌ – ఎ, బి, సి, ఇ, కెలతోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఫోలేట్‌ వంటి పోషకాలు ఉంటాయి. బొప్పాయిలోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను పరిష్కరిస్తాయి. బొప్పాయి (Papaya) పండు మాత్రమే కాదు, బొప్పాయి గింజలు (Papaya Seeds) మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణుల చెబుతున్నారు. మనం వేస్ట్‌ అని బయట పారేసే బొప్పాయి గింజలు అనేక అనారోగ్యాలు దరి చేరకుండా రక్షిస్తాయి. బొప్పాయి గింజలు (Papaya Seeds) తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పోషకాలు ఉంటాయి:

బొప్పాయి గింజల్లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. వీటిలో జింక్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. బొప్పాయి గింజల్లో ఒలీక్ యాసిడ్, పాలీఫెనాల్స్ వంటి మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఫ్లేవనాయిడ్స్‌ ఉంటాయి. ఈ పోషక విలువలు మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఇన్ఫ్లమేషన్‌ తగ్గిస్తుంది:

బొప్పాయి గింజల్లో విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్‌‌‌‌‌‌‌‌‌, పాలీఫెనాల్స్ వంటి ఇతర సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీలుగా పనిచేస్తాయి. గౌట్, ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు ఉన్నావారు బొప్పాయి గింజలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

బరువు తగ్గుతారు:

బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. మీ శరీరం నుంచి వ్యర్థాలను సులభంగా తొలగిస్తుంది. ఫైబర్‌ మీ జీవక్రియ మెరుగ్గా జరిగేలా తోడ్పడుతుంది. మీ శరీరం అదనపు కొవ్వును నిల్వ చేయకుండా నిరోధిస్తుంది. బొప్పాయి గింజలు తీసుకుంటే.. మీ బరువు కంట్రోల్‌లో ఉంటుంది.

గట్‌ హెల్త్‌కు మంచిది:

బొప్పాయి గింజల్లో కార్పైన్ ఉంటుంది. ఇది మీ పేగులలో పురుగుల, బ్యాక్టీరియాను చంపుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బొప్పాయి గింజల్లోని అధిక ఫైబర్‌ పేగుల కదలికలను నియంత్రిస్తుంది.

నెలసరి నొప్పి తగ్గిస్తుంది:

బొప్పాయి గింజ్లో ఉండే కెరోటిన్.. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది.. బొప్పాయి గింజలు ఋతుక్రమాన్ని ప్రేరేపించడంలో, దాని క్రమబద్ధతను పెంచడంలో తోడ్పడతాయి. నెలసరి సమయంలో నొప్పిని తగ్గించడానికీ.. బొప్పాయి గింజలు సహాయపడతాయి.

క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుంది:

బొప్పాయి గింజల్లో పాలీఫెనాల్స్ ఉంటాయి, ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి అనేక రకాల క్యాన్సర‌ నుంచి మనల్ని రక్షిస్తాయి. క్యాన్సర్‌కు దూరంగా ఉండాలంటే.. 5 నుంచి 6 బొప్పాయి గింజలను పొడి చేసిత మీ ఆహారంలో, టీ చేసుకుని తాగండి.

కొలెస్ట్రాల్‌ కరుగుతుంది:

బొప్పాయి గింజల్లోని ఫైబర్‌‌‌‌ శరీరంలోని కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. బొప్పాయి గింజల్లో ఒలీక్ యాసిడ్‌, ఇతర మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్‌ మెండుగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి.

ఎన్ని తినాలి:

ఒక రోజులో 1 గ్రాముయ/ 5 బొప్పాయి గింజల కంటే ఎక్కువ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి గింజలు పచ్చివి కూడా తినొచ్చు, పొడర్‌ రూపంలోనూ తీసుకోవచ్చు. కానీ, వీటిని తీసుకునే ముందు డాక్టర్‌ సలహా తీసుకోవడం మంచిది.

Also Read:  Lung Problems: లంగ్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటే బయటపెట్టే 7 సంకేతాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • cancer
  • cholesterol
  • daily
  • Eating
  • food
  • health
  • Life Style
  • papaya
  • Reduce
  • risk
  • Seeds
  • tips
  • Tricks

Related News

7 Tips to Curb Insomnia for Stress Management

Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Stress Management: “ఒత్తిడి” అనేది మనం చేసే రోజువారీ కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఫోన్‌కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్‌లో మునిగిపోవడం అనేది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.

  • Don't worry about low sperm count... follow these Ayurvedic tips and you'll be at the peak of virility...!!

    Sperm Count In Men: స్పెర్మ్ కౌంట్ తగ్గిందని బాధపడకండి… ఆయుర్వేదంలో ఈ చిట్కాలు పాటిస్తే మీరే మగమహారాజు…!!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd