HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Are You Troubled By Pores On Your Face But You Have To Try These Packs

Face Pack : ముఖంపై రంధ్రాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ ప్యాక్స్ ట్రై చేయాల్సిందే..

చాలామంది స్త్రీ పురుషులు ముఖం (Face)పై రంద్రాలు గుంతలు (Pores) వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.

  • Author : Naresh Kumar Date : 22-12-2023 - 6:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Are You Troubled By Pores On Your Face.. But You Have To Try These Packs..
Are You Troubled By Pores On Your Face.. But You Have To Try These Packs..

Effective Face Packs for Pores on Face : చాలామంది స్త్రీ పురుషులు ముఖంపై రంద్రాలు గుంతలు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మొటిమల తాలూకా మచ్చలు కొన్ని కొన్ని సార్లు అలాగే గుంతలుగా రంధ్రాలుగా మారి అలాగే ఉంటాయి. వాటిని తగ్గించుకోవడం కోసం అనేక రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఇందుకోసం ఎన్నో రకాల బ్యూటీ ప్రోడక్ట్ లు వంటింటి చిట్కాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఫలితం లభించక దిగులు చెందుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ నాలుగు రకాల ప్యాక్ లు ట్రై చేస్తే చాలు.

We’re now on WhatsApp. Click to Join.

ఇందుకోసం తేనె ఒక చెంచా, నిమ్మరసం ఒక చెంచా, పంచదార పావు టీ స్పూన్ ఈ మూడు పదార్థాలన్నీ ఒక గిన్నెలో వేసి బాగా కలిపి ముఖానికి (Face) అప్లై చేసి మసాజ్ చేయాలి.10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాల్లో ఉన్న మురికి, మృత కణాలు బయటకొస్తాయి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే రంధ్రాలు తగ్గుతాయి.

మరొక ఫేస్ ప్యాక్ విషయానికి వస్తే.. దోసకాయ రసం 4 చెంచాలు, రోజ్ వాటర్ 2 స్పూన్లు తీసుకోవాలి. అయితే ముందుగా రోజ్ వాటర్, దోసకాయ రసం రెండింటినీ గిన్నెలో బాగా మిక్స్ చేసి ముఖం (Face)పై అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని క్లీన్ చేయాలి. రెగ్యులర్‌గా ఇలా చేస్తే ముఖంపై ముడతలు తగ్గి రంధ్రాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అప్పుడు మీ ముఖం యవ్వనంగా కనిపిస్తుంది.

మరొక ప్యాక్ విషయానికి వస్తే.. ఇందుకోసం కావాల్సిన పదార్థాలు.. శనగపిండి 1 చెంచా పసుపు పావు చెంచా పెరుగు 2 చెంచాలు ఆలివ్ ఆయిల్ 1 చెంచా. ముందుగా శనగపిండి, పసుపు, ఆలివ్ ఆయిల్ పెరుగుతో కలిపి ఒక గిన్నెలో మెత్తగా పేస్టులా చేయాలి. మీ ముఖాన్ని చక్కగా క్లీన్ చేసి 20 నిమిషాల పాటు అలానే ఉండి ఆ తర్వాత ముఖాన్ని మృదువుగా మసాజ్ చేయాలి. తర్వాత చల్లని నీటితో క్లీన్ చేయాలి. శనగపిండి చర్మ రంధ్రాల్లో మలినాలని తొలగిస్తుంది. పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంపై బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లని దూరం చేస్తాయి. ఆలివ్ ఆయిల్ చర్మాన్ని మృదువుగా, రంధ్రాలను తగ్గిస్తుంది.

మరో ప్యాక్ కోసం పెరుగు 2 చెంచాలు, శనగపిండి 1 చెంచా.. ముందుగా పెరుగులో శనగపిండి కలిపి 15 నిమిషాల పాటు అలానే ఉంచండి. తర్వాత నెమ్మదిగా నీరు చల్లి వేళ్ళతో మృదువుగా మసాజ్ చేసి క్లీన్ చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు మాత్రమే చేయాలి.

Also Read:  Health Benefits: ఉదయాన్నే టీకి బదులుగా ఆ జ్యూస్ తాగితే చాలు.. ఎన్నో ప్రయోజనాలు?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • Face
  • face pack
  • health
  • lifestyle
  • Pores
  • tips

Related News

Coconut Water

ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమ‌వుతుంది?

కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం వంటి సహజ ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో నీరు, ఖనిజాల సమతుల్యతను కాపాడతాయి.

  • Onion

    పచ్చి ఉల్లిపాయను ఎవరు తినకూడదు?

  • Healthy Lifestyle Tips

    ఆయుర్వేదం కొత్త జీవితాన్ని ఎలా ఇవ్వగలదు?

  • New Covid Variant

    మ‌రోసారి క‌రోనా క‌ల‌క‌లం.. కొత్త వేరియంట్ పేరు ఇదే!

  • ENT Specialists

    కళ్లు, ముక్కు, చెవులు ఆరోగ్యంగా ఉండాలంటే!

Latest News

  • Trisha: విజయ్‌తో ప్రేమ లేకపోతే అర్థమే లేదంటూ త్రిష పోస్ట్

  • YCP : ఆ ఇద్దరి నేతలపై జగన్ కన్ను

  • Hyundai : హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్స్

  • Mangos : మార్కెట్‌లో కల్తీ మామిడి పండ్లు..తెలుసుకోవడం ఎలా అంటే !!

  • Hyderabad : పెళ్లి ఎక్కడ జరగదో అనే భయం తో ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Trending News

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

    • ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!

    • బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

    • అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం.. 2,076 మంది మృతి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd