Delhi Election Results : చారిత్రాత్మకమైన విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు: ప్రధాని
ఢిల్లీని అభివృద్ది చేయడంలో ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో వికసిత్ భారత్ ను నిర్మించడంలో ఢిల్లీ ప్రధాన పాత్ర పోషించే విధంగా పని చేస్తామని హామీ ఇస్తున్నాం అని ట్వీట్ చేశారు.
- By Latha Suma Published Date - 04:53 PM, Sat - 8 February 25

Delhi Election Results : ప్రధాని మోడీ ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఈ మేరకు సంతోషం వ్యక్తం చేశారు. చారిత్రాత్మకమైన విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జనశక్తి ప్రధానం. అభివృద్ధి, సుపరిపాలనను గెలిపించారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని అందించిన ఢిల్లీలోని నా ప్రియమైన సోదర, సోదరీమణులకు సెల్యూట్. ఢిల్లీని అభివృద్ది చేయడంలో ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో వికసిత్ భారత్ ను నిర్మించడంలో ఢిల్లీ ప్రధాన పాత్ర పోషించే విధంగా పని చేస్తామని హామీ ఇస్తున్నాం అని ట్వీట్ చేశారు.
Jana Shakti is paramount!
Development wins, good governance triumphs.
I bow to my dear sisters and brothers of Delhi for this resounding and historic mandate to @BJP4India. We are humbled and honoured to receive these blessings.
It is our guarantee that we will leave no…
— Narendra Modi (@narendramodi) February 8, 2025
ఢిల్లీ సమగ్ర అభివృద్ధికి, ఇక్కడి ప్రజల జీవనాన్ని మెరుగుపర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటాము. ఇది మా గ్యారంటీ. అంతేకాదు.. అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో ఢిల్లీ కీలక పాత్ర పోషించేందుకు నిరంతరం కృషి చేస్తాం అని మోడీ వెల్లడించారు. ఈ గెలుపులో పగలు, రాత్రి కస్టపడి శ్రమించిన కార్యకర్తలు, పార్టీ నేతలకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. కాగా, 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు బీజేపీకు పట్టం కట్టారు. శనివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలకు బీజేపీ గండికొట్టింది.
ఇక, ఏళ్ల తరబడి ఢిల్లీలో విజయం కోసం చూస్తున్న బీజేపీ చివరికి అనుకున్నది సాధించింది. 1993లో ఒక సారి మినహా బిజేపీ దేశరాజధానిలో ఎప్పుడూ వెనకంజలోనే ఉంది. అప్పట్లో 49 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 14 సీట్లకు పరిమితమైంది. కానీ 1998 తరువాత మాత్రం బీజేపీ ట్రాక్ రికార్డు చెదిరిపోయింది. 1998 నాటి ఎన్నికల్లో బీజేపీ 15 సీట్లకు పరిమితం కాగా కాంగ్రెస్ మాత్రం 52 సీట్లల్లో జయకేతనం ఎగురవేసింది. 2003 ఎన్నికల్లో బీజేపీ కొద్దిగా పుంజుకుని 20 సీట్లు దక్కించుకుంది. ఆ తరువాత జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ సీట్ల సంఖ్య 23కు చేరింది. ఆప్ ఆవిర్భవించిన తర్వాత ఆ పార్టీదే విజయం అయింది.
Read Also: Mallanna Sagar : సీఎం రేవంత్ కు హరీష్ రావు బహిరంగ లేఖ