BJP : నక్సలిజానికి కొందరు ఆజ్యం పోస్తున్నారు: కేంద్ర మంత్రి అమిత్ షా
BJP : జేఎంఎం ప్రభుత్వం తప్పుడు విధానాల వల్ల ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సమయంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. నక్సలిజానికి కొందరు ఆజ్యం పోస్తున్నారని ఆరోపిస్తూ.. 2026 మార్చి నాటికి ఈ సమస్యను నిర్మూలిస్తామని ఉద్ఘాటించారు.
- By Latha Suma Published Date - 06:50 PM, Sun - 3 November 24

Jharkhand Elections : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి అమిత్ షా బరకట్టా, సిమారియాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హేమంత్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. మహిళలను వేధించే చొరబాటుదారులను తలకిందులుగా వేలాడదీస్తామని హెచ్చరించారు. జేఎంఎం ప్రభుత్వం తప్పుడు విధానాల వల్ల ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సమయంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. నక్సలిజానికి కొందరు ఆజ్యం పోస్తున్నారని ఆరోపిస్తూ.. 2026 మార్చి నాటికి ఈ సమస్యను నిర్మూలిస్తామని ఉద్ఘాటించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకారం చూస్తే.. జార్ఖండ్ ఎన్నికల్లో 81 స్థానాల్లో ఎన్డీయే 52 కైవసం చేసుకుంటుంది.
కాగా, అధికారంలోకి రాగానే అవినీతి నేతలను కటకటాల వెనక్కు పంపుతాం. రూ.1.36 లక్షల కోట్లు బొగ్గు గనుల బకాయిలు క్లియర్ చేయమని హేమంత్ సోరెన్ కోరుతున్నారు. కానీ, కేంద్రం ఇప్పటికే జార్ఖండ్‌కు రూ.3.80 లక్షల కోట్లు కేటాయించింది” అని అమిత్ షా పేర్కొన్నారు. అంతకుముందు రాంచీలో నిర్వహించిన సభలో చొరబాటుదారులపై మండిపడ్డారు. జార్ఖండ్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిని తరిమికొడతమన్ని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఇకపోతే.. రాష్ట్రంలో ఈ నెల 13, 20న రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Read Also: AM/NS India : ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్న AM/NS