AM/NS India : ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్న AM/NS
AM/NS India : ఆర్సెలార్ మిట్టల్ మరియు నిప్పాన్ స్టీల్ (AM/NS) అనకాపల్లి జిల్లాలో రూ.1.40 లక్షల కోట్ల వ్యయంతో జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ముందుకు వచ్చినట్లు వెల్లడించింది
- By Sudheer Published Date - 06:37 PM, Sun - 3 November 24

Anakapalle : ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి (రాజయ్యపేట) వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్స్‌లకు చెందిన జాయింట్ వెంచర్ కంపెనీ ‘ఏఎం/ఎన్‌ఎస్’ (AM/NS India) ముందుకొచ్చింది. నిప్పన్ స్టీల్స్ (ArcelorMittal and Nippon Steel) అనే జపాన్ కేంద్రంగా, ఆర్సెలార్ మిట్టల్ అనేది లగ్జంబర్గ్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఈ రెండు స్టీల్ తయారీ కంపెనీలు కలిసి ‘ఏఎం/ఎన్‌ఎస్’ అనే జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటుచేశాయి. ఇప్పుడు ఈ కంపెనీయే నక్కపల్లి (రాజయ్యపేట) వద్ద స్టీలు ప్లాంటు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు టీడీపీ ట్విట్టర్ వేదికగా పేర్కొంది.
ఆర్సెలార్ మిట్టల్ మరియు నిప్పాన్ స్టీల్ (AM/NS) అనకాపల్లి జిల్లాలో రూ.1.40 లక్షల కోట్ల వ్యయంతో జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ముందుకు వచ్చినట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. మంత్రి నారా లోకేశ్ ఈ ఒప్పందంపై ఆర్సెలార్ మిట్టల్ CEO ఆదిత్య మిట్టల్తో జూమ్ కాల్‌లో చర్చించినట్లు వెల్లడించారు. ఈ జాయింట్ వెంచర్ ద్వారా ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, స్థానిక పరిశ్రమలు అభివృద్ధి చెందే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఇలాంటి భారీ పెట్టుబడులను ఆకర్షించడం అభివృద్ధికి దోహదపడుతుందని, ప్రత్యేకంగా స్టీల్ పరిశ్రమలో రాష్ట్రానికి అదనపు ఆదాయాన్ని తీసుకురావడమే కాకుండా, భారతీయ స్టీల్ మార్కెట్లో APని ప్రాధాన్యతను కలిగించేలా చేస్తుందని ఈ ప్రాజెక్టు ప్రతిపాదనకు మద్దతుగా నెటిజన్లు తమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.
AM/NS ఇండియా భారతదేశంలోని ఉక్కు విభాగంలో ఒక పరిశ్రమ దిగ్గజం. ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి సంస్థ అయిన ఆర్సెలోర్ మిట్టాల్ మరియు జపాన్‌లోని ప్రముఖ ఉక్కు కంపెనీ అయిన నిప్పాన్ స్టీల్ యొక్క సంయుక్త వెంచర్. ఆర్సెలోర్ మిట్టాల్ అమెరికా, యూరోప్, ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలలో.. 60 కంటే… pic.twitter.com/e9bdDqMXGm
— Telugu Desam Party (@JaiTDP) November 3, 2024
Read Also : HYD: దీపావళి రోజున గాంధీ విగ్రహానికి ఘోర అవమానం