HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pm Modis Sketch An Unexpected Turn With The Selection Of All Party Teams Under The Auspices Of The Central Government

All Party Delegations: అఖిలపక్ష బృందాలకు రాజకీయ సెగ.. తెరపైకి థరూర్, మనీశ్, సల్మాన్, పఠాన్‌

సమర్ధులైన ఎంపీలను ప్రభుత్వమే అఖిలపక్ష బృందాలకు ఎంపిక చేసింది’’ అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు(All Party Delegations) అంటున్నారు. 

  • By Pasha Published Date - 05:45 PM, Mon - 19 May 25
  • daily-hunt
Pm Modi All Party Delegations Congress Jairam Ramesh Kiren Rijiju Mamata Banerjee yusuf Pathan

All Party Delegations:  జాతీయ రాజకీయాలు మరోసారి రసకందాయంలో పడ్డాయి. పాకిస్తాన్ ఉగ్రవాదం గురించి వివరించేందుకు విదేశాలకు వెళ్లే అఖిలపక్ష బృందాలకు ఎంపీలను ఎంపిక చేసే వ్యవహారం రాజకీయ పార్టీల మధ్య చిచ్చుపెట్టింది. తాము చెప్పిన నేతలకు  అఖిలపక్ష బృందాలలో చోటు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఎంపీల ఎంపిక గురించి అస్సలు తమను సంప్రదించనే లేదని తృణమూల్ కాంగ్రెస్ వాదిస్తోంది. ‘‘పార్టీల సిఫార్సులు మాకు అక్కర్లేదు. వాళ్ల అంతర్గత రాజకీయాల గురించి మాకు అక్కర్లేదు. సమర్ధులైన ఎంపీలను ప్రభుత్వమే అఖిలపక్ష బృందాలకు ఎంపిక చేసింది’’ అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు(All Party Delegations) అంటున్నారు.  తీరొక్క వాదనలతో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతున్నాయో ఈ కథనంలో చూద్దాం..

Also Read :Hyderabad Blasts Plan : గ్రూప్‌ 2 కోచింగ్‌ కోసం వచ్చి.. ఉగ్రవాదం వైపు మళ్లిన యువకుడు

ఆ నలుగురిలో ఒక్కరికే ఛాన్స్

ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, సయ్యద్ నసీర్ హుసేన్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్‌లను అఖిలపక్ష బృందాలను ఎంపిక చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కోరింది. అయితే వీరిలో నుంచి ఒక్క ఆనంద్ శర్మనే కేంద్ర సర్కారు ఎంపిక చేసింది.  మరో నలుగురు కాంగ్రెస్ ఎంపీలను తనంతట తానుగా ఎంపిక చేసి అఖిలపక్ష బృందంలో చోటు కల్పించింది. ఈవిధంగా కాంగ్రెస్ పెద్దల సిఫార్సు లేకుండానే  అవకాశాన్ని  పొందిన నేతలే.. శశిథరూర్, మనీశ్ తివారీ, అమర్ సింగ్, సల్మాన్ ఖుర్షీద్‌.  ఈ నలుగురిలో శశిథరూర్‌కు ఏకంగా ఒక అఖిలపక్ష బృందానికి సారథ్యం వహించే అవకాశాన్ని కల్పించారు.

Also Read :Colonel Sofiya Qureshi : కర్నల్ సోఫియా పై వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణలను అంగీకరించలేం : సుప్రీం కోర్టు

తెరపైకి శశిథరూర్, మనీశ్ తివారీ, సల్మాన్ ఖుర్షీద్‌

‘‘విదేశాంగ వ్యవహారాలపై  మంచి పట్టు కలిగిన కాంగ్రెస్ నేతలు శశిథరూర్, మనీశ్ తివారీ, సల్మాన్ ఖుర్షీద్‌. వారి పేర్లను కాంగ్రెస్ పార్టీ ఎందుకు సిఫార్సు చేయలేదు. అయినా మేం ఆ ముగ్గురికి గొప్ప అవకాశం కల్పించాం’’ అని కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు చెప్పారు. ఈ వ్యాఖ్యల ప్రభావంతో శశిథరూర్, మనీశ్ తివారీలు కాంగ్రెస్ హైకమాండ్‌కు మరింత దూరమయ్యే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌కు దూరంగా శశిథరూర్, మనీశ్ తివారీ ఉంటున్నారు. 2026లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాటికి  శశిథరూర్ బీజేపీలోకి జంప్ అవుతారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఆయనపై కాంగ్రెస్ పార్టీ వేటు వేస్తుందని కొందరు జోస్యం చెబుతున్నారు.

మనీశ్ తివారీ.. బీజేపీలోకి వెళ్దామని అనుకున్నారా ? 

2024 ఫిబ్రవరిలోనే బీజేపీలోకి వెళ్లిపోవాలని మనీశ్ తివారీ భావించారట. పంజాబ్‌లోని లూధియానా లోక్‌సభ సీటును ఆయనకు ఇచ్చేందుకు బీజేపీ పెద్దలు కూడా అప్పట్లో ఓకే చెప్పారట. అయితే చివరి నిమిషంలో తన ఆలోచనను మనీశ్ తివారీ మార్చుకున్నారట.

సల్మాన్ ఖుర్షీద్‌కు ప్రయారిటీ తగ్గిందా ? 

సల్మాన్ ఖుర్షీద్‌కు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీ తగ్గించింది. ఆయన సూచించిన వారికి గత లోక్‌సభ ఎన్నికల టైంలో ప్రయారిటీ ఇవ్వలేదు. యూపీ రాజకీయాలపై ప్రియాంకాగాంధీ, రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రా ఫోకస్ పెట్టడం మొదలైనప్పటి నుంచి అక్కడ  సల్మాన్ ఖుర్షీద్‌కు ప్రాధాన్యత తగ్గింది. అయినప్పటికీ ఆయన కాంగ్రెస్‌ పార్టీని వీడేందుకు సిద్ధంగా లేరు.  కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తేనే అఖిలపక్ష బృందాలతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్తానని సల్మాన్ ప్రకటించారు.

యూసుఫ్ పఠాన్‌ వద్దు.. మేం చెప్పిన వాళ్లే వెళ్లాలి : టీఎంసీ 

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ యూసుఫ్ పఠాన్‌ను అఖిలపక్ష బృందానికి కేంద్రం ఎంపిక చేసింది.  ఈవిషయాన్ని టీఎంసీ పెద్దలు మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ వ్యతిరేకించారు. తాము చెప్పినవాళ్లు మాత్రమే అఖిలపక్ష బృందంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్తారని తేల్చి చెప్పారు. బెంగాల్‌లో ముస్లిం మైనారిటీల ఓట్లు ఎక్కువ. ఆ వర్గానికి చెందిన  యూసుఫ్ పఠాన్‌‌ను అఖిలపక్ష బృందం నుంచి  వెనక్కి లాగినందు వల్ల రాబోయే రోజుల్లో టీఎంసీకి రాజకీయంగా ఎదురుదెబ్బ తగులుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • All Party Delegations
  • All Party Teams
  • central government
  • congress
  • jairam ramesh
  • Kiren Rijiju
  • mamata banerjee
  • pm modi
  • Yusuf Pathan

Related News

Jublihils Campign

Jubilee Hills By Election : నగరవాసులకు కొత్త కష్టాలు

Jubilee Hills By Election : ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా ట్రాఫిక్‌తో నిండిపోయి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.

  • KCR appearance before Kaleshwaram Commission postponed

    KCR : కేసీఆర్ ను అరెస్టు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు – కిషన్ రెడ్డి

  • India Cricket Team

    PM Modi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు!

  • Congress

    Congress: సీఎం రేవంత్- అజారుద్దీన్‌ల వివాదంపై కాంగ్రెస్ క్లారిటీ!

  • Kcr Nxt Cm

    KCR : 500 రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం ఖాయం..రాసిపెట్టుకోండి – కేటీఆర్ ధీమా

Latest News

  • Praja Sankalpa Yatra : మరోసారి జగన్ పాదయాత్ర..ఎప్పటి నుండి అంటే !!

  • Woman Suicide : చీమలకు భయపడి వివాహిత ఆత్మహత్య

  • PAN- Aadhaar: పాన్ కార్డు ఉన్న‌వారికి బిగ్ అల‌ర్ట్‌.. డిసెంబ‌ర్ 31 వ‌ర‌కే ఛాన్స్‌!

  • Investments : ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ పెట్టుబడులు

  • RCB Franchise: అమ్మ‌కానికి ఆర్సీబీ.. కొనుగోలు చేయాల‌ని చూస్తున్న టాప్‌-5 కంపెనీలు ఇవే!

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd