Hyderabad Blasts Plan : గ్రూప్ 2 కోచింగ్ కోసం వచ్చి.. ఉగ్రవాదం వైపు మళ్లిన యువకుడు
విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్(Hyderabad Blasts Plan) పూర్తి పేరు సిరాజుర్ రహ్మాన్.
- By Pasha Published Date - 02:07 PM, Mon - 19 May 25

Hyderabad Blasts Plan : ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్, తెలంగాణలోని సికింద్రాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్‌ల అరెస్టు వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఇద్దరూ కలిసి హైదరాబాద్ నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నారని పోలీసు వర్గాలు ఆరోపిస్తున్నాయి. తాజా అప్‌డేట్స్‌ను ఈ కథనంలో తెలుసుకుందాం..
సిరాజ్ నేపథ్యం.. గ్రూప్ 2 కోచింగ్..
- విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్(Hyderabad Blasts Plan) పూర్తి పేరు సిరాజుర్ రహ్మాన్.
- సిరాజ్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.
- సిరాజ్ తండ్రి ఏపీ పోలీసు శాఖలో ఏఎస్సై. అతడి సోదరుడు కానిస్టేబుల్.
- సిరాజ్‌ను కూడా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేర్పించాలని అతడి తండ్రి భావించారు.
- గ్రూప్ 2 పరీక్షల కోచింగ్ కోసం హైదరాబాద్‌కు సిరాజ్‌ను పంపారు.
- హైదరాబాద్‌లో ఉండగా సోషల్ మీడియాలో సిరాజ్ బిజీ అయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకున్నాడు.
- ఈక్రమంలోనే సౌదీ అరేబియాలో ఉంటున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ హ్యాండ్లర్ ఒకరితో సిరాజ్‌కు పరిచయం ఏర్పడింది.
- ఇదే వ్యవధిలో సికింద్రాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్‌తోనూ సిరాజ్‌కు స్నేహం ఏర్పడింది. ఈ ఇద్దరూ కలిసి ఐసిస్ హ్యాండ్లర్‌కు దగ్గరయ్యారు.
- అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పేరిట సంస్థను సిరాజ్ ఏర్పాటు చేయగా, అందులో సభ్యుడిగా సమీర్ చేరినట్లు పోలీసులు చెబుతున్నారు.
- హైదరాబాద్‌లో గ్రూప్ 2 కోచింగ్‌ను సిరాజ్ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత విజయనగరానికి తిరిగి వెళ్లిపోయాడు.
- విజయనగరంలో నుంచే సౌదీ అరేబియాలో ఉన్న ఐసిస్ హ్యాండ్లర్‌తో సిరాజ్ సంప్రదింపులు జరిపాడు. సికింద్రాబాద్‌లో ఉన్న సమీర్‌తోనూ టచ్‌లో ఉన్నాడు.
- ఐసిస్ హ్యాండ్లర్ సలహాల మేరకు పేలుడు పదార్ధాల తయారీకి అవసరమైన కెమికల్స్ కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చాడు. వాటిని తన ఇంటికి తెప్పించుకున్నాడు.
- సిరాజ్ తెప్పించుకున్న రసాయనాల జాబితాలో పొటాషియం క్లోరేట్, సల్ఫర్ వంటివి ఉన్నాయి.
- ఈ రసాయనాలతో బాంబులు తయారుచేసి మే 21, 22 తేదీల్లో విజయనగరంలో పేలుళ్ల రీహార్సల్ చేయాలని సిరాజ్, సమీర్ నిర్ణయించారు.
- పేలుడు పదార్థాల కోసం సిరాజ్ ఆన్‌లైన్ ఆర్డర్ ఇచ్చాక.. భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది. అక్కడి నుంచి తెలంగాణ ఇంటెలీజెన్స్ విభాగానికి, వారి నుంచి ఏపీ పోలీస్ ఇంటెలీజెన్స్ విభాగానికి సమాచారం చేరింది.
- ఆ వెంటనే శనివారం రోజు (మే 17న) విజయనగరంలో ఉన్న సిరాజ్ ఇంటిపై పోలీసులు రైడ్స్ చేశారు. పేలుడు పదార్థాల తయారీకి వాడే కెమికల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
- తదుపరిగా ఏపీ, తెలంగాణ ఇంటెలీజెన్స్ విభాగాల అధికారులు సికింద్రాబాద్‌లో సమీర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
- ట్రాన్సిట్ వారంట్‌పై సమీర్‌ను హైదరాబాద్ నుంచి విజయనగరానికి తరలించారు.
- సిరాజ్, సమీర్‌లకు విజయనగరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.