HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Comments On Colonel Sophia Ministers Apology Cannot Be Accepted Supreme Court

Colonel Sofiya Qureshi : కర్నల్ సోఫియా పై వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణలను అంగీకరించలేం : సుప్రీం కోర్టు

ఇది కేవలం న్యాయ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది" అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. క్షమాపణలు చెప్పడం ఓ ఫార్మాలిటీ కాకుండా, బాధ్యతతో కూడిన చర్య అయి ఉండాలి అని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాక..మంత్రి క్షమాపణలను అంగీకరించలేమని సుప్రీంకోర్టు  స్పష్టం చేసింది.

  • By Latha Suma Published Date - 02:22 PM, Mon - 19 May 25
  • daily-hunt
Comments on Colonel Sophia.. Minister's apology cannot be accepted: Supreme Court
Comments on Colonel Sophia.. Minister's apology cannot be accepted: Supreme Court

Colonel Sofiya Qureshi : భారత సైన్యంలో సేవలందిస్తున్న కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి కున్వర్ విజయ్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. “ఉగ్రవాదుల సోదరి” అని ఆమెను మంత్రి పేర్కొనడంపై దేశమంతటా కలకలం రేగింది. ఈ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనిని సుమోటోగా తీసుకున్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించగా, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల జరిగిన విచారణలో న్యాయస్థానం మంత్రి క్షమాపణలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. “క్షమాపణలు ఎక్కడ, ఎలా చెప్పారు? మీ మాటల్లో మనస్ఫూర్తి లేదు. ఇది కేవలం న్యాయ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది” అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. క్షమాపణలు చెప్పడం ఓ ఫార్మాలిటీ కాకుండా, బాధ్యతతో కూడిన చర్య అయి ఉండాలి అని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాక..మంత్రి క్షమాపణలను అంగీకరించలేమని సుప్రీంకోర్టు  స్పష్టం చేసింది.

Read Also: Hyderabad Blasts Plan : గ్రూప్‌ 2 కోచింగ్‌ కోసం వచ్చి.. ఉగ్రవాదం వైపు మళ్లిన యువకుడు

ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తగా, సుప్రీంకోర్టు మంత్రి విజయ్ షా వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రతి పదాన్ని బాధ్యతగా వాడాలి. మీరు మాట్లాడిన విధానం దేశానికి అపకీర్తిని తీసుకొచ్చింది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు మంత్రి వ్యాఖ్యలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ఉదయం 10 గంటల్లోపు సిట్‌ను ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీకి ఆదేశాలు ఇచ్చింది. ఈ బృందంలో రాష్ట్రానికి చెందని ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉండాలని, వారిలో కనీసం ఒకరు ఎస్పీ ర్యాంక్ కలిగిన మహిళా అధికారి కావాలని సూచించింది. అయితే, ప్రస్తుతానికి మంత్రి అరెస్టుపై కోర్టు స్టే విధించింది. కానీ విచారణకు పూర్తిగా సహకరించాల్సిందేనని స్పష్టం చేసింది. మంత్రి వైఖరి విచారకరం అని, సైనిక అధికారిణిపై వ్యక్తిగత దూషణలు చేసిన తీరును న్యాయస్థానం తూర్పారపడింది. ఈ సంఘటన దేశ ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. దేశ రక్షణ కోసం పని చేసే సైనికులపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ మన్నించదగినవి కావని, ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం హితవు పలికింది.

Read Also: Visakhapatnam : విశాఖ డిప్యూటీ మేయ‌ర్ అభ్య‌ర్థిగా ద‌ల్లి గోవింద్‌


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Colonel Sofiya Qureshi
  • controversial comments
  • Minister apology
  • Minister Kunwar Vijay Shah
  • Supreme Court

Related News

Four years of locality mandatory for medical students: Supreme Court

Telangana : వైద్య విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి: సుప్రీంకోర్టు

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం, తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి మరియు డివిజన్ బెంచ్ ఇచ్చిన పూర్వపు ఉత్తర్వులను పక్కన పెట్టింది. దీంతో, స్థానికత నిబంధనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి బలమైన మద్దతు లభించింది.

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd