PM Kisan 21st Installment : దీపావళి కానుక.. అకౌంట్లలోకి రూ.2వేలు?
PM Kisan 21st Installment : దీపావళి పండుగ సందర్భంగా రైతుల కుటుంబాలకు ఇది ఒక పెద్ద సాయం అవుతుందని భావిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రైతులు రూ. 6,000 వార్షిక సహాయం పొందుతుండగా, ప్రతి నాలుగునెలలకోసారి విడతగా నిధులు విడుదల అవుతున్నాయి
- Author : Sudheer
Date : 06-10-2025 - 3:44 IST
Published By : Hashtagu Telugu Desk
దేశంలోని చిన్న, చితక రైతులకు ఆర్థికంగా అండగా నిలిచే పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకం(PM Kisan 21st Installment) లో భాగంగా 21వ విడత నిధుల విడుదలకు కేంద్రం సిద్ధమవుతోంది. నేషనల్ మీడియా నివేదికల ప్రకారం..మరో వారం రోజుల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 2,000 చొప్పున నేరుగా జమ కానుంది. దీపావళి పండుగ సందర్భంగా రైతుల కుటుంబాలకు ఇది ఒక పెద్ద సాయం అవుతుందని భావిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రైతులు రూ. 6,000 వార్షిక సహాయం పొందుతుండగా, ప్రతి నాలుగునెలలకోసారి విడతగా నిధులు విడుదల అవుతున్నాయి.
Strong Hair: ఏంటి.. బియ్యం నీటితో జుట్టుకు ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయా.?
ప్రస్తుత విడతలోనూ రైతులు నిధులను పొందాలంటే కొన్ని తప్పనిసరి నిబంధనలు పాటించాల్సి ఉంది. EKYC పూర్తి చేయడం , ఆధార్-బ్యాంక్ ఖాతా లింక్ పూర్తి కావడం వంటి అంశాలు అధికారులచే మళ్లీ గుర్తుచేయబడ్డాయి. ఈ లింక్ లేదా EKYC పూర్తికాకపోతే నిధులు జమ అయ్యే అవకాశం ఉండదని కేంద్రం స్పష్టం చేస్తోంది. కాబట్టి రైతులు సమీపంలోని CSC సెంటర్లు లేదా ఆన్‌లైన్ ద్వారా వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది పూర్తయితే నిధులు నేరుగా వారి ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక రైతులు నిత్యం పంటలను రక్షించుకునే దిశగా కొత్త చీడపీడల నివారణ పద్ధతులు , పాడి మరియు జీవపోషణ పద్ధతులు వంటి అంశాలను నేర్చుకోవడం కూడా సమానంగా ముఖ్యం. ఇందుకోసం పలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్లలో “పాడిపంట” కేటగిరీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. ఇందులో ఆధునిక పద్ధతులు, కొత్త విధానాలు, వ్యాధి నివారణా చిట్కాలు, పశుపోషణకు సంబంధించిన సమాచారాన్ని నిరంతరం అప్డేట్ చేస్తున్నారు. ఈ వనరులను రైతులు వినియోగించుకుంటే కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, ఉత్పత్తి-నాణ్యత పెంపు సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.