Strong Hair: ఏంటి.. బియ్యం నీటితో జుట్టుకు ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయా.?
Strong Hair: బియ్యం కడిగిన నీరు అలాగే బియ్యం జుట్టుకు సంబంధించిన చాలా రకాల సమస్యలను దూరం చేస్తుందని అలాగే ఇవి ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:57 PM, Mon - 6 October 25

Strong Hair: ప్రస్తుత రోజుల్లో చాలామంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. జుట్టు రాలిపోవడం, నిర్జీవంగా అయిపోవడం, డాండ్రఫ్, జుట్టు చిట్లి పోవడం లాంటి ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించుకోవడం కోసం ఎన్నో రకాల హెయిర్ ఆయిల్స్ క్రీమ్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అయినా కూడా కొన్నిసార్లు మంచి ఫలితాలు కనిపించవు. మరి అలాంటప్పుడు ఏం చేయాలో, టువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కేవలం మీ కిచెన్ లో ఉన్న బియ్యంతో జుట్టు సమస్యలను దూరం చేసుకోవచ్చట. సహజమైన మెరుపును, బలాన్ని ఇవ్వడంలో బియ్యం నీరు ఎంతో బాగా ఉపయగపడుతుందట. బియ్యంలో విటమిన్ B, E, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు పోషణను అందిస్తాయట. అలాగే దెబ్బతిన్న జుట్టును బాగు చేయడంలో హెల్ప్ చేస్తాయట. బియ్యం నీటిని తయారు చేసుకోవడం కోసం అర కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. ఆ నీటిని వడకట్టి స్ప్రే బాటిల్ లో వేసుకోవాలి. షాంపు చేసిన తర్వాత దీనిని జుట్టుకు అప్లై చేసి 15 నిమిషాలు ఉంచాలి.
తర్వాత శుభ్రమైన నీటితో హెయిర్ వాష్ చేసేయాలి. ఇలా వారానికి రెండు సార్లు ఉపయోగిస్తే జుట్టుకు సహజమైన మెరుపు రావడంతో పాటు జుట్టు సమస్యలు కూడా నెమ్మదిగా తగ్గు ముఖం పడతాయట. జుట్టుకు పోషణ కావాలంటే హెయిర్ మాస్క్ కచ్చితంగా ఉపయోగించాలని చెబుతున్నారు. ముందుగా 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి తీసుకోవాలట. దానిలో టేబుల్ స్పూన్ పెరుగు, టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకోవాలట. అన్ని బాగా మిక్స్ అయ్యేలా కలిపి పేస్ట్ గా చేసుకోవాలట. ఈ పేస్ట్ ను జుట్టు కుదుళ్లపై బాగా అప్లై చేయాలనీ, 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపు తో హెయిర్ వాష్ చేయాలని, ఈ మాస్క్ జుట్టుకు డీప్ కండిషనింగ్ ఇస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తే జుట్టుకు సహజమైన మెరుపు అందుతుందట. డ్యామేజ్ హెయిర్ దూరమయ్యి, జుట్టు పొడిబారడం తగ్గుతుందట. అలాగే జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయని జుట్టు మందంగా, బలంగా మారుతుందని చెబుతున్నారు.