Security Breach in Lok Sabha: పార్లమెంటరీ భద్రత లోపంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఫైర్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో భారీ భద్రతను సైతం లెక్కచేయకుండా ఇద్దరు వ్యక్తులు లోక్ సభలోకి ప్రవేశించి కలకలం రేపారు. ఇద్దరు ఆగంతకులు లోక్‌సభలోకి దూకి బాష్పవాయువు ప్రయోగించారు.
- Author : Praveen Aluthuru
Date : 13-12-2023 - 7:00 IST
Published By : Hashtagu Telugu Desk
Security Breach in Lok Sabha: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో భారీ భద్రతను సైతం లెక్కచేయకుండా ఇద్దరు వ్యక్తులు లోక్ సభలోకి ప్రవేశించి కలకలం రేపారు. ఇద్దరు ఆగంతకులు లోక్‌సభలోకి దూకి బాష్పవాయువు ప్రయోగించారు. అందులో నుంచి ఎల్లో పొగలు వెలువడి లోక్‌సభ అంతటా వ్యాపించాయి. దీంతో ఆ ఇద్దర్ని కొందరు ఎంపీలు చుట్టుముట్టగా ఇంతలో సెక్యూరిటీ వచ్చి అదుపులోకి తీసుకుంది. మరోవైపు పార్లమెంటు భవనం వెలుపల నిరసన తెలిపిన ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్ట్ చేసిన వారిని పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు. విచారణలో లోక్‌సభలోకి చొరబడి బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల వివరాలు వెల్లడయ్యాయి. మైసూరుకు చెందిన మనోరంజన్, సాగర్ శర్మగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. కర్నాటక బీజేపీ ఎంపీ ఇచ్చిన పర్మిషన్ స్లిప్‌లో ఇద్దరూ ప్రవేశించినట్లు సమాచారం.అదేవిధంగా, పార్లమెంటు వెలుపల నిరసన తెలిపినందుకు అరెస్టయిన వారిలో అరియానా రాష్ట్రంలోని హిసార్ జిల్లాకు చెందిన నీలం (42 సంవత్సరాలు) మరియు మహారాష్ట్ర రాష్ట్రంలోని లాతూర్ ప్రాంతానికి చెందిన అమోల్ షిండే (25 సంవత్సరాలు) ఉన్నారు.
పార్లమెంటులో జరిగిన ఈ పరిణామంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. ఈ ఘటనను ఆయన ఖండించారు. పార్లమెంటులో భద్రతా లోపం మన ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పుగా పేర్కొన్నారు. ఈ విషయంలో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు. తక్షణమే విచారణను ప్రారంభించాలని, జవాబుదారీతనాన్ని పరిష్కరించాలని, భవిష్యత్తులో తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Telangana: ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలపై కేటీఆర్ ఫైర్