Manish Sisodia: ఇంటికి చేరుకున్న మనీష్ సిసోడియా.. సాయంత్రం 5 గంటల వరకే ఛాన్స్..!
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో నిందితుడు అయిన మనీష్ సిసోడియా (Manish Sisodia) తన భార్యను కలిసేందుకు కొన్ని షరతులతో ఢిల్లీ హైకోర్టు శుక్రవారం అనుమతించింది.
- By Gopichand Published Date - 01:02 PM, Sat - 3 June 23

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో నిందితుడు అయిన మనీష్ సిసోడియా (Manish Sisodia) తన భార్యను కలిసేందుకు కొన్ని షరతులతో ఢిల్లీ హైకోర్టు శుక్రవారం అనుమతించింది. శనివారం అతను తన భార్యను కలవడానికి ఇంటికి చేరుకున్నాడు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా తన భార్యను కలిసేందుకు ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలిసేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. అయితే సీమా సిసోడియా.. మనీష్ రాకముందే తన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. దీనితో ఇంటికి చేరుకున్న మనీష్ సిసోడియా తన భార్యను కలవలేకపోయాడని సమాచారం.
మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియా మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి తీవ్రమైన అంశం ఏమిటంటే.. ఇందులో శరీరంపై మనస్సు నియంత్రణ తగ్గిపోతుంది. ఏప్రిల్ నెలలో కూడా మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియా అనారోగ్యంతో ఉన్నారు. ఆ సమయంలో కూడా సీమా సిసోడియా అపోలో ఆసుపత్రిలో చేరారు.
Also Read: Babu Delhi Tour: ఢిల్లీకి చంద్రబాబు, మోదీ, అమిత్ షాలతో కీలక భేటీ?
ఈ షరతులతో అనుమతి
అయితే, ఈ మినహాయింపులతో పాటు మనీష్ సిసోడియా అనుసరించాల్సిన కొన్ని షరతులను కూడా కోర్టు తెలిపింది. ఈ సమయంలో సిసోడియా మీడియాతో మాట్లాడకూడదని మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కూడా ఉపయోగించకూడదు అని కోర్ట్ తెలిపింది. ఆయన భార్య అనారోగ్యం కారణంగా సిసోడియా న్యాయవాద బృందం ఢిల్లీ హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఆరు వారాల పాటు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆదేశించాలని మధ్యంతర బెయిల్ కోరింది. అంతే కాకుండా సిసోడియా తన కుటుంబ సభ్యులను తప్ప మరెవరినీ కలిసేందుకు అనుమతించలేదు.
ఈడీ మార్చిలో సిసోడియాను అరెస్టు చేసింది
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను తీహార్ జైలులో గంటల తరబడి విచారించిన తర్వాత మార్చి 9న ఈడీ అరెస్ట్ చేసింది. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (జిఎన్‌సిటిడి) ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కొనసాగుతున్న విచారణలో సిసోడియాను ఫిబ్రవరి చివరలో సిబిఐ అరెస్టు చేసింది.