HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Mallikarjun Kharge Comments On Bjp 2

Parliament : బీజేపీలో చేరగానే అవినీతిపరులు నీతిమంతులుగా మారుతారు: ఖర్గే

మిమ్మల్ని కేవలం ఒక రాష్ట్రమో, ప్రాంతమో ఓటేయలేదు. మీరు ఇతర ప్రాంతాలపై ప్రతీకారం తీర్చుకోవడం తగదు అని మండిపడ్డారు.

  • Author : Latha Suma Date : 16-12-2024 - 4:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
mallikarjun kharge comments on bjp
mallikarjun kharge comments on bjp

Parliament : భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్‌లో రాజ్యాంగం ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఈ రోజు చర్చలో పాల్గొన్న రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ.. బీజేపీ తీరును, ఆ పార్టీ ముఖ్య నేతల తీరును తప్పుపట్టారు. బీజేపీలో చేరగానే అవినీతిపరులు నీతిమంతులుగా మారుతారని విమర్శలు చేశారు. ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న నాయకులపై అవినీతి ముద్రవేసి, వాళ్లు బీజేపీలో చేరగానే నీతిమంతులుగా బీజేపీ చెబుతుండటాన్ని ఖర్గే ఎగతాళి చేశారు.

దేశంలో ఎన్నికలు ఎక్కడుంటే అక్కడికే ప్రధాని మోడీ వెళ్తారు. కానీ మణిపూర్‌కు వెళ్లేందుకు మాత్రం అతను ఇష్టపడటం లేదు అంటూ విమర్శించారు. మిమ్మల్ని కేవలం ఒక రాష్ట్రమో, ప్రాంతమో ఓటేయలేదు. మీరు ఇతర ప్రాంతాలపై ప్రతీకారం తీర్చుకోవడం తగదు అని మండిపడ్డారు. ప్రధానికి కావాల్సినంత భద్రత ఉంటుందని, అయినా ప్రధాని మాత్రం మణిపూర్‌కు వెళ్లేందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఇన్నిరోజులవుతున్నా మణిపూర్‌లో పరిస్థితి మీరు ఎందుకు చక్కదిద్దడం లేదని ప్రభుత్వాన్ని ఖర్గే ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ మణిపూర్‌కు వెళ్లారని, అంతేగాక అక్కడ యాత్ర చేశారని మల్లికార్జున్‌ ఖర్గే గుర్తుచేశారు. కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం రాజ్యసభలో భారత రాజ్యాంగంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ఇప్పటికే ఈ నెల 13, 14 తేదీల్లో లోక్‌సభలో చర్చ పూర్తయ్యింది.

Read Also: Polavaram Project : రాష్ట్రానికి పోలవరం గేమ్ ఛేంజర్ : సీఎం చంద్రబాబు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • congress
  • mallikarjun kharge
  • manipur
  • parliament
  • pm modi
  • rahul gandhi

Related News

PM Modi

12 ఏళ్ల‌లో తొలిసారి.. అసంతృప్తి వ్య‌క్తం చేసిన పీఎం మోదీ!

నిన్న సాయంత్రం పార్లమెంటులో ఈ బిల్లుపై ఓటింగ్ జరిగింది. లోక్‌సభలో ‘రాజ్యాంగ (131వ) సవరణ బిల్లు 2026’ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి.

  • Lok Sabha Seats

    లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

  • Kangana Ranaut spoke about her bond with Chirag Paswan

    Kangana Ranaut: కేంద్ర మంత్రితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్

  • BJP's Tejasvi Surya Slams congress party

    BJP MP Tejasvi Surya: ఏపీ విభజనపై ఎంపీ తేజస్వి సూర్య ఫైర్

  • Kalvakuntla Kavitha Warning

    Kalvakuntla Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: కల్వకుంట్ల కవిత

Latest News

  • IPL 2026 -RCB vs DC : ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో DC విజయం

  • NBK-Koratala Shiva : బాలకృష్ణ ను డైరెక్ట్ చేయబోతున్న కొరటాల ?

  • Ram : సొంతంగా కథ రాసుకున్న హీరో రామ్..మరి ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడో ?

  • Coke Studio India : కోక్ స్టూడియో నుండి బుల్లెయా వే సాంగ్

  • Godrej Agrovet : లక్ష మంది మహిళా నిపుణులే లక్ష్యంగా గోద్రెజ్ ‘దిశ’

Trending News

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

    • ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd