Polavaram Project : రాష్ట్రానికి పోలవరం గేమ్ ఛేంజర్ : సీఎం చంద్రబాబు
ఆగస్టు-అక్టోబర్ 2020లో వరదల వల్ల డయా ఫ్రం వాల్ పూర్తిగా దెబ్బతింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ ని పూర్తిగా నిర్వీర్యం చేశారని చంద్రబాబు తెలిపారు.
- By Latha Suma Published Date - 03:22 PM, Mon - 16 December 24

Polavaram Project : ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పరిశీల అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలవరంతో కొత్తగా 7లక్షల ఎకరాలకు ఆయకట్టు సాగులోకి వస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో 50లక్షల క్యూసెక్కుల వాటర్‌కి నిర్మాణం చేస్తున్నాం. నదిని డైవర్ట్ చేస్తున్నాం. డయా ఫ్రం వాల్ కట్టి వదిలిపెట్టామని తెలిపారు. ఆగస్టు-అక్టోబర్ 2020లో వరదల వల్ల డయా ఫ్రం వాల్ పూర్తిగా దెబ్బతింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ ని పూర్తిగా నిర్వీర్యం చేశారని చంద్రబాబు తెలిపారు.
గత ప్రభుత్వ అవినీతి, కుట్రలు కలిపి ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారని సీఎం చంద్రబాబు తెలిపారు. మా హయాంలో 70 శాతం పనులు పూర్తయ్యాయి. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే నీటి సమస్య ఉండదని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు కారణంగా 7.20 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుందన్నారు. విశాఖ పారిశ్రామిక అవసరాలు, తాగునీటికి 23 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయన్నారు. 28 సార్లు క్షేత్ర స్థాయికి వచ్చాననీ, 82 సార్లు వర్చువల్ గా సమీక్ష చేశానని తెలిపారు.
గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 15 నెలల పాటు ఎలాంటి నిర్మాణ పనులు చేయలేదని తెలిపారు. పదేళ్లుగా పట్టిసీమ ప్రాజెక్ట్ కే గత ప్రభుత్వం శ్రీరామ రక్ష అయిందని తెలిపారు. 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడమే మా లక్ష్యం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పాత, కొత్త కాంట్రాక్టర్లుంటే జవాబుదరి తనం కష్టతరం అవుతోంది. ప్రాజెక్ట్ ను నిర్లక్ష్యం చేయడం వల్ల రూ.2,400 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: Mohan Babu : మోహన్ బాబు కు పోలీస్ కమిషనర్ హెచ్చరిక