India Attack : పాక్ రక్షణ వలయం ధ్వంసం.. భారత్ ‘హార్పీ’ ఫీచర్లు ఇవీ
హార్పీ సూసైడ్ డ్రోన్లు మేడిన్ ఇజ్రాయెల్(India Attack). వీటిని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (IAI) తయారు చేస్తుంది. అందుకే చాలా బాగా పనిచేస్తాయి.
- By Pasha Published Date - 06:26 PM, Thu - 8 May 25

India Attack : ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్తాన్‌కు భారత్ మరో పెద్ద షాక్ ఇచ్చింది. డ్రోన్లు, మిస్సైళ్లతో భారత్‌పై ప్రతీకారం తీర్చుకుందామని భావించిన పాకిస్తాన్‌కు భారత ఆర్మీ చుక్కలు చూపించింది. కరాచీ, లాహోర్‌లలో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ వ్యవస్థలను భారత సైన్యానికి చెందిన హార్పీ సూసైడ్ డ్రోన్లు ధ్వంసం చేశాయి. దీంతో నోరు వెళ్లబెట్టడం మినహా పాకిస్తాన్‌కు ఏమీ మిగల్లేదు. ఈసందర్భంగా హార్పీ డ్రోన్ల ఫీచర్ల గురించి తెలుసుకుందాం..
Also Read :KA Paul : ప్రధాని మోడీని కలిశాక పాక్‌కు వెళ్తా.. కేఏ పాల్ కీలక ప్రకటన
భారత ఆర్మీ హార్పీ డ్రోన్లలోని ఫీచర్లు..
- హార్పీ సూసైడ్ డ్రోన్లు మేడిన్ ఇజ్రాయెల్(India Attack). వీటిని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (IAI) తయారు చేస్తుంది. అందుకే చాలా బాగా పనిచేస్తాయి.
- ఈ సూసైడ్ డ్రోన్లు తమతో 23 కేజీల పేలోడ్‌ను తీసుకెళ్లగలవు. ఇవి నిర్దిష్ట లక్ష్యానికి చేరుకున్నాక.. దానిపై పడి తమను తాము పేల్చుకుంటాయి.
- HMX, TNT వంటి భారీ పేలుడు సామర్థ్యం కలిగిన మందుగుండుకు కూడా హార్పీ డ్రోన్లు తీసుకెళ్లగలవు.
- రాత్రి,పగలు అనే తేడా లేకుండా కంటిన్యూగా 9 గంటల పాటు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల నడుమ గగనతలంలో సంచరించే కెపాసిటీ వీటి సొంతం.
- గరిష్ఠంగా 1000 కి.మీ దూరంలోని లక్ష్యాలను చేరుకొని, వాటిని ధ్వంసం చేసే కెపాసిటీ హర్పీ డ్రోన్లకు ఉంది.
- హార్పీ డ్రోన్‌లో టార్గెట్‌ను, ఫ్రీక్వెన్సీని సెట్ చేస్తే.. ఆ దిశగానే అది దూసుకెళ్తుంది. ఎటు నుంచైనా టార్గెట్‌పై దాడి చేయడం దీని ప్రత్యేకత.
- జీపీఎస్ లాంటి నేవిగేషన్ వ్యవస్థల మద్దతు లభించని యుద్ధ క్షేత్రాల్లోనూ ఇవి టార్గెట్‌ను కచ్చితత్వంతో తాకుతాయి. తునాతునకలు చేస్తాయి.
Also Read :Operation Sindoor Inside : ‘ఆపరేషన్ సిందూర్’ కోసం భారత్ ఇలా ప్లాన్ చేసింది..
- హార్పీలను సందర్భాన్ని బట్టి డ్రోన్‌లా, మిస్సైల్‌లా వాడుకోవచ్చు. డ్రోన్‌లా వాడినప్పుడు శత్రు స్థావరాలపై నిఘా పెట్టొచ్చు. మిస్సైల్‌లా వాడితే అది శత్రు లక్ష్యాలపై పడి వాటిని ధ్వంసం చేస్తుంది.
- హార్పీ డ్రోన్లలో ఉండే ‘లోఇటెరింగ్ మోడ్’ ఫీచర్‌ను ఆన్ చేస్తే డ్రోన్ ఏదైనా ఒకే ప్రదేశంలో ఎక్కువసేపు నిలబడిపోతుంది. అంటే శత్రులక్ష్యం వైపు వదిలాక కూడా దీన్ని కంట్రోల్ చేయొచ్చు.