Tariff Cuts : అమెరికా సుంకాల తగ్గింపు పై భారత్ క్లారీటీ
అమెరికా అధ్యక్షుడు పదేపదే లేవనెత్తుతున్న ఈ సమస్య పరిష్కారానికి సెప్టెంబర్ వరకు సమయం కోరాం అని పార్లమెంటరీ ప్యానెల్‌కు భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు జాతీయ మీడియా కథనం పేర్కొంది.
- By Latha Suma Published Date - 03:47 PM, Tue - 11 March 25

Tariff Cuts : డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ వలసలపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. అనంతరం భారీగా సుంకాలు పెంచేశారు. వాణిజ్య యుద్ధం ప్రకటించడంతో స్నేహితులు కూడా శత్రువులుగా మారిపోయే పరిస్తితి ఏర్పడింది. భారత్ విధించినట్లుగానే.. తాము కూడా సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇటీవల ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించినప్పుడు కూడా ట్రంప్ అదే ప్రకటన చేశారు.
Read Also: RK Roja : ఇక రోజా వంతు వచ్చింది..ఆడుదాం ఆంధ్రాలో అవినీతిపై ప్రభుత్వం ఫోకస్
అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాపై సుంకాల తగ్గింపునకు భారత్ అంగీకరించిందని తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలపై మంగళవారం భారత ప్రభుత్వం స్పందించింది. సుంకాల తగ్గింపునకు అమెరికాకు ఎలాంటి హామీ ఇవ్వలేదని వెల్లడించింది. ఈ మేరకు పార్లమెంట్ ప్యానెల్‌కు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సుంకాల తగ్గింపు అంశంపై అమెరికాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. అమెరికా అధ్యక్షుడు పదేపదే లేవనెత్తుతున్న ఈ సమస్య పరిష్కారానికి సెప్టెంబర్ వరకు సమయం కోరాం అని పార్లమెంటరీ ప్యానెల్‌కు భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు జాతీయ మీడియా కథనం పేర్కొంది.
ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ట్రంప్ పాలన, భారత్‌పై సుంకాలు తదితర అంశాలపై స్పందించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలన్నింటికీ సమాన అధికారాలు ఉండాలనే విధానంలో ట్రంప్ పాలన సాగుతోంది. అది భారత ఆలోచనలకు సరిగ్గా సరిపోతుంది అని పేర్కొన్నారు. ఇక, అమెరికా పరస్పరం ప్రయోజనకరమైన ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకొనే దిశగా కృషి చేస్తున్నాయని, తక్షణం సుంకాల సర్దుబాటు చేసుకునే బదులు దీర్ఘకాలిక వాణిజ్య సహకారంపై దృష్టిసారించాయని భారత వాణిజ్య శాఖ కార్యదర్శి వెల్లడించారు.
కాగా, డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించిన .. భారత్ అత్యధికంగా సుంకాలు వసూలుచేస్తోందని, ఆ దేశంలో ఏ వస్తువు విక్రయించడానికి వీలులేనంత భారంగా ఉన్నాయన్నారు. ఈ అంశాన్ని లేవనెత్తడం.. భారత్ చర్యలను తాము బహిరంగపరచడం వల్ల సుంకాలను తగ్గించడానికి ఆ దేశం అంగీకరించిందని తెలిపారు. దీనిపై తాజాగా భారత్ స్పందించింది.