RK Roja : ఇక రోజా వంతు వచ్చింది..ఆడుదాం ఆంధ్రాలో అవినీతిపై ప్రభుత్వం ఫోకస్
RK Roja : ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినందుకు సంబంధిత అధికారులపై, మాజీ మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
- By Sudheer Published Date - 03:37 PM, Tue - 11 March 25

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ప్రధాన చర్చగా మారిన విషయం మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) అవినీతి ఆరోపణలు. గత వైసీపీ ప్రభుత్వం(YCP)లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన నేతలపై ప్రభుత్వ దృష్టి పెట్టింది. ఇప్పటికే పలు స్కామ్ లపై దర్యాప్తులు మొదలుపెట్టి పలువుర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో నెక్స్ట్ అరెస్ట్ మాజీ మంత్రి రోజానే (Roja Arrest ) అని ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం ప్రస్తుతం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం(Adudam Andhra Program)పై ఫోకస్ పెట్టింది. టీడీపీ ఎమ్మెల్సీలు దువ్వరపు రామారావు, రాంగోపాల్ రెడ్డి లాంటి నేతలు ఈ కార్యక్రమంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రూ. 119 కోట్ల అక్రమ లావాదేవీలు చోటుచేసుకున్నాయని శాసన మండలిలో లేవనెత్తారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినందుకు సంబంధిత అధికారులపై, మాజీ మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Gold Smuggling Case : రన్యా రావు సన్నిహితుడు అరెస్ట్
ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో ఫండ్స్ దుర్వినియోగం జరిగిందా అనే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఈ అవినీతి ఆరోపణలపై 45 రోజుల్లో సమగ్ర నివేదిక అందిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఈ విచారణ ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇదే సమయంలో రోజా తన పదవిని ఉపయోగించుకుని తన నియోజకవర్గంలో అనేక అక్రమాలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రీడా, పర్యాటక శాఖల్లో ఆమె తీరు వివాదాస్పదంగా మారిందని, ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో ఆమె అనేక అక్రమాలను నిర్వహించినట్లు రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.
ఇకపోతే రోజా గతంలో టీడీపీ నాయకులు చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్‌లను తీవ్ర విమర్శలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆమె వ్యక్తిగత దూషణలు, రాజకీయ వేదికలపై చేసిన వ్యాఖ్యలు విపక్షాలను తీవ్రంగా భాధించాయి. అయితే ఇప్పుడు అదే నేచర్ ఆమెకు గుణపాఠం నేర్పిస్తోందని ఆమె రాజకీయ ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు. అవినీతి ఆరోపణలు రోజాపై బలమైనవిగా మారుతుండటంతో, నేర విచారణ తర్వాత ఆమె అరెస్టు కూడా తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సమగ్ర దర్యాప్తు తర్వాత రోజాపై ఉన్న అవినీతి ఆరోపణలు నిరూపితమైతే, ఆమె జైలుకే వెళ్లే పరిస్థితి తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.