Independence Day 2024: సియాచిన్ నుంచి కశ్మీర్ వరకు.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, వీడియో..!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి నుంచి వేల మీటర్ల ఎత్తులో ఉన్న సియాచిన్ వద్ద భారత సైన్యం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. కాశ్మీర్‌లో ఉన్న ఇండియన్ సర్వీస్ కూడా లోయలో ఘనంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
- By Gopichand Published Date - 05:36 PM, Thu - 15 August 24

Independence Day 2024: ఈరోజు దేశం మొత్తం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను (Independence Day 2024) ఘనంగా జరుపుకుంది. ఎర్రకోటపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాలలు, కళాశాలలు, ఇతర కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణతో పాటు ఇతర కార్యక్రమాలు నిర్వహించారు. దేశంలోని సామాన్య ప్రజలే కాదు, దేశంలోని వీర సైనికులు కూడా వివిధ ప్రాంతాల నుంచి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి నుంచి వేల మీటర్ల ఎత్తులో ఉన్న సియాచిన్ వద్ద భారత సైన్యం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. కాశ్మీర్‌లో ఉన్న ఇండియన్ సర్వీస్ కూడా లోయలో ఘనంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. దీనితో పాటు భారతదేశం అన్ని పారామిలిటరీ దళాలు కూడా స్వాతంత్య్ర దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాయి. సియాచిన్ నుండి కాశ్మీర్ వరకు వివిధ ప్రాంతాల నుండి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సైనికులు జెండాను ఎగురవేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సియాచిన్‌లో సైన్యం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది
5000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్ గ్లేసియర్ వద్ద భారత సైన్యం అప్రమత్తమైంది. తద్వారా శత్రువులు దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించలేరు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సియాచిన్ గ్లేసియర్ వద్ద సైనికులు జెండాను ఎగురవేశారు. దీనితో పాటు ఆర్మీ సైనికులు లడఖ్‌లో జెండా ఎగురవేత వేడుక చిత్రాలను కూడా పంచుకున్నారు.
Also Read: Curd: పెరుగుతో అశుభాలు కూడా శుభాలు అవుతాయట.. అదెలా అంటే!
ఇండియన్ కోస్ట్ గార్డ్ స్వాతంత్య్ర వేడుకలు
భారతదేశంలోని సముద్ర తీరాలను పరిరక్షిస్తున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ సైనికులు కూడా ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జెండా ర్యాలీని నిర్వహించి చాలా ఘనంగా జరుపుకున్నారు. దీంతో పాటు కోస్ట్‌గార్డ్ సైనికులు బైక్‌లు, జిప్సీలపై త్రివర్ణ పతాక ర్యాలీ చేపట్టి స్వాతంత్య్ర వేడుకలు జరుపుకున్నారు.
#78thIndependenceDay@IndiaCoastGuard Regional HQs (NW) conducted a spirited bike rally at #Gandhinagar in continuing with #HarGharTiranga initiatives.
Entire #ICG Region NW conducting spirited events in run up to the landmark day.#ICG Dist Hq 1 ( South Gujarat) & #ICG Dist… pic.twitter.com/bOX4L6j4Qu
— Indian Coast Guard (@IndiaCoastGuard) August 14, 2024
సీఆర్పీఎఫ్ ఈ విధంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది
భారతదేశంలో అతిపెద్ద పారా మిలటరీ దళం అయిన CRPF కూడా ప్రతి ఇంటిలో త్రివర్ణ పతాక ప్రచారంలో పాల్గొన్నారు. CRPF దాని అధికారిక X హ్యాండిల్ @crpfindia ద్వారా వీడియో షేర్ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
झलकियां: #HarGharTiranga अभियान में #CRPF पूरे जोश और उत्साह के साथ देश के विभिन्न हिस्सों में भाग लेते हुए।#SelfieWithTiranga pic.twitter.com/l4r79Z1ULT
— 🇮🇳CRPF🇮🇳 (@crpfindia) August 15, 2024
బీఎస్ఎఫ్ త్రివర్ణ పతాకాన్ని ఇలా ఎగురవేసింది
భారతదేశపు మొదటి రక్షణ శ్రేణిగా పేరొందిన సరిహద్దు భద్రతా దళం (BSF) సైనికులు దేశంలోని వివిధ ప్రదేశాలలో సంబరాలు చేసుకున్నారు. గౌహతిలో బీఎస్ఎఫ్ జవాన్లు చిన్న పిల్లలతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
To celebrate India's 78th #IndependenceDay 🇮🇳, school students from bordering villages in Coochbehar (WB) joined hands with the #BSF to organize a #TirangaYatra, spreading the message of patriotism and unity across the nation.
Jai Hind! 🇮🇳 #IndependenceDay2024 pic.twitter.com/ab4otRYKAk
— BSF GUWAHATI (@BSF_Guwahati) August 15, 2024