Cyclone Fengal Updates: తీవ్ర వాయుగుండం.. మరో 12 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం!
రానున్న నాలుగు రోజులలో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 24 గంటలలో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
- By Gopichand Published Date - 08:05 PM, Wed - 27 November 24

Cyclone Fengal Updates: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం (Cyclone Fengal Updates) ఏర్పడింది. మరో 12 గంటల్లో అది తుఫాన్ గా మారే అవకాశం ఉంది. గడచిన 6 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా తీవ్ర వాయుగుండం కదులుతుంది. తీవ్ర వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులలో ఉత్తర వాయవ్య దిశగా శ్రీలంక తీరాన్ని తాకుతూ తమిళనాడు తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రానున్న నాలుగు రోజులలో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 24 గంటలలో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న 48 గంటలలో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు,నెల్లూరు , తిరుపతి జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈనెల 30వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు సమాచారం. 28 వ తేదీ నుంచి ఉత్తర కోస్తాపై కూడా గాలులు ప్రభావం ఉండనుంది. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లారాదని, రాష్ట్రంలోని అన్ని పోర్టులలో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు వివరించారు.
Also Read: Deputy CM Bhatti: రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: డిప్యూటీ సీఎం భట్టి
దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన
దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. మరో 6 గంటల్లో ఇది తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ‘‘వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతంలో పలు చోట్ల గురు, శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో 35 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది’’ అని తెలిపారు.