Deputy CM Bhatti: రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: డిప్యూటీ సీఎం భట్టి
క్రిస్మస్ వేడుకలు నిర్వహణ సందర్భంగా జిహెచ్ఎంసి తో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్ బి స్టేడియంలో జరిగే క్రిస్మస్ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు.
- By Gopichand Published Date - 07:33 PM, Wed - 27 November 24

Deputy CM Bhatti: ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (Deputy CM Bhatti) అధికారులను ఆదేశించారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణపై బుధవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సెలెబ్రేషన్ కమిటీ సభ్యులు, ఉన్నత అధికారులతో సమీక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెండు వందల ప్రాంతాలు, 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
క్రిస్మస్ వేడుకలు నిర్వహణ సందర్భంగా జిహెచ్ఎంసి తో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్ బి స్టేడియంలో జరిగే క్రిస్మస్ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం హాజరవుతున్న వేడుకలకు రాష్ట్రంలో ఉన్న అన్ని చర్చిల అధిపతులు పాల్గొనే విధంగా చూడాలన్నారు. అన్ని చర్చిల అధిపతులకు, క్రైస్తవ మత పెద్దలకు క్రిస్మస్ వేడుకల ఆహ్వానాలను అందజేయాలని క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కు సూచించారు. సోషల్ వర్క్, మెడికల్, ఎడ్యుకేషన్, లిట్రర్రి, స్పోర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ రంగాల్లో అవార్డులకు ఎంపికైన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లక్ష రూపాయలు, అదే విధంగా సోషల్ వర్క్, మెడికల్, ఎడ్యుకేషన్ అవార్డులకు ఎంపికైన సంస్థలకు రెండు లక్షల రూపాయల చెక్కులను అందిస్తామన్నారు.
Also Read: Food Poisoning : తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 30 నుండి బీఆర్‌ఎస్ గురుకుల బాట: కేటీఆర్
అవార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రధాన పత్రికల్లో నోటిఫికేషన్ వేయాలని క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సబితను ఆదేశించారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యే విందుకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలన్నారు. క్రిస్మస్ వేడుకలను అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని కోరారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి ఆనంద్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి తఫ్సీర్ ఎక్బాల్, జీ.ఏ.డి డైరెక్టర్ ఎస్. వెంకట్రావు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కాంతి వెస్లీ, మాజీ ఎమ్మెల్యే క్రిస్టైన్ లాజరస్, తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సబిత, భువనగిరి డి.సి.పి రాజేష్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.