AAP : త్వరలోనే సీఎం అతిశీ అరెస్ట్ అవుతారు: కేజ్రీవాల్
సీఎం అతిశీని తప్పుడు కేసులో అరెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. అంతకంటే ముందు పలువురు ఆప్ నేతల ఇళ్లలో సోదాలు జరగొచ్చని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 11:58 AM, Wed - 25 December 24
AAP : ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీని త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేజ్రీవాల్ ట్వీట్ పెట్టారు. మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రకటనలు చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని ‘ఎక్స్’ ద్వారా విమర్శలు గుప్పించారు. దీనిపై మరిన్ని వివరాలు చెప్పేందుకు నేటి మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం పెడుతున్నట్టు చెప్పారు.
ఆప్ ప్రభుత్వం త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో రెండు రోజుల క్రితం మహిళా సమ్మాన్ యోజన, సంజీవన యోజన పథకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకాలు ప్రకటిండచం కొందరికి నచ్చలేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే సీఎం అతిశీని తప్పుడు కేసులో అరెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. అంతకంటే ముందు పలువురు ఆప్ నేతల ఇళ్లలో సోదాలు జరగొచ్చని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఇక బీజేపీ మహారాష్ట్రలో అధికారంలోకి రావడానికి కారణమైన ‘లాడ్లీ బెహ్నా యోజన’ పథకాన్ని సవరించి ‘మహిళా సమ్మాన్ యోజన’ పేరుతో ఆప్ ఓ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం అర్హులైన మహిళకు రూ. 1000 అందిస్తుండగా, తాము అధికారంలోకి వస్తే రూ. 2,100 అందిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. ఇక, సంజీవని యోజన పథకంలో భాగంగా 60 ఏళ్లు, ఆపై వయసు కలిగిన ఢిల్లీ వాసుల ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల ఖర్చును భరిస్తుంది.
Read Also: Celebrity Restaurants 2024 : 2024లో సెలబ్రిటీలు ప్రారంభించిన రెస్టారెంట్లు ఇవే..