CBI Raids : మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ రైడ్స్
ప్రస్తుతం రాష్ట్రంలోని రాయ్‌పూర్, భిలాయిలలో ఉన్న భూపేశ్ బఘేల్ నివాసాల్లోనూ సీబీఐ అధికారులు(CBI Raids) సోదాలు చేస్తున్నారు.
- By Pasha Published Date - 09:57 AM, Wed - 26 March 25

CBI Raids : ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్‌కు మరో షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే ఆయన నివాసంలో ఈడీ సోదాలు చేయగా, ఇవాళ మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ వ్యవహారంలో సీబీఐ రైడ్స్ చేస్తోంది. రూ.6000 కోట్లు విలువైన ఈ స్కాం వ్యవహారంలో ఇప్పటికే బఘేల్‌పై ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఆర్థికనేరాల విభాగం కేసు నమోదు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని రాయ్‌పూర్, భిలాయిలలో ఉన్న భూపేశ్ బఘేల్ నివాసాల్లోనూ సీబీఐ అధికారులు(CBI Raids) సోదాలు చేస్తున్నారు. బఘేల్‌కు సన్నిహితుడిగా పేరొందిన ఒక సీనియర్ పోలీసు అధికారి ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాలపై స్పందించిన భూపేశ్ బఘేల్.. ‘‘కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం కోసం నేను ఢిల్లీకి వెళ్లబోతున్న సమయంలో సీబీఐ నా ఇంటికి వచ్చింది. బీజేపీ కుట్రలో భాగంగానే నాపై ఈ దాడులు చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు.
Also Read :Saugat e Modi : ముస్లింలకు మోడీ రంజాన్ తోఫా.. ‘సౌగత్-ఎ-మోడీ’ కిట్లు
యాప్ యజమాని శుభమ్ సోనీ ఆరోపణలు
2023లో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ వెలుగు చూసింది. మహదేవ్ బెట్టింగ్ యాప్‌ను రూపొందించే క్రమంలో అప్పట్లో సీఎంగా ఉన్న భూపేశ్‌కు రూ.508 కోట్లు చెల్లించానని యాప్ యజమాని శుభమ్ సోనీ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలను బఘేల్ వెంటనే ఖండించారు.దీనిపై దర్యాప్తు చేసిన ఈడీ, పలువురు కీలక రాజకీయ నేతలు, అధికారుల పాత్ర ఉందని తెలిపింది.
Also Read :Rajiv Yuva Vikasam: రూ.50వేల యూనిట్‌పై 100 శాతం రాయితీ.. దరఖాస్తు ప్రక్రియ, అర్హతలివీ
ఈడీ రైడ్స్‌లో..
లిక్కర్ స్కాం వ్యవహారంలో ఇటీవలే బఘేల్, ఆయన కుమారుడు చైతన్య నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు రైడ్స్ చేశారు. ఆ సోదాల సందర్భంగా రూ.30 లక్షల నగదు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తనిఖీల అనంతరం వెళ్తున్న ఈడీ అధికారుల వాహనాలపై పలువురు నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది.