Parliament: ఇది సాధారణ పొగ: లోక్‌సభ ఘటనపై స్పీకర్ ఓం బిర్లా వివరణ..
ఈ రోజు లోక్‌సభలో ఇద్దరు ఆగంతకులు అలజడి సృష్టించారు. సభ లోపల టియర్ గ్యాస్ వదలడంతో సభ్యులు భయాందోళనకు గురయ్యారు. దీంతో పార్లమెంటులో భద్రత లోపం కూడా బయటపడింది. ఇదిలా ఉండగా ఘటనపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు
- By Praveen Aluthuru Published Date - 03:33 PM, Wed - 13 December 23

Parliament: ఈ రోజు లోక్‌సభలో ఇద్దరు ఆగంతకులు అలజడి సృష్టించారు. సభ లోపల టియర్ గ్యాస్ వదలడంతో సభ్యులు భయాందోళనకు గురయ్యారు. దీంతో పార్లమెంటులో భద్రత లోపం కూడా బయటపడింది. ఇదిలా ఉండగా ఘటనపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఆయన మాట్లాడుతూ… ఇద్దరు ఆగంతకులు విడుదల చేసిన పొగ సాధారణమేనని ప్రాథమిక విచారణలో తేలిందని, అందువల్ల సభ్యులు ఆందోళన చెందవద్దని స్పీకర్ ఓం బిర్లా అన్నారు.జీరో అవర్ ఘటనపై సీరియస్‌గా విచారణ జరుపుతున్నామన్నారు. ఢిల్లీ పోలీసులకు కీలక సూచనలు చేశారు. అది కేవలం పొగ మాత్రమేనని ప్రాథమిక విచారణలో తేలింది. కాబట్టి పొగ గురించి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇద్దరినీ అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వారికి మద్దతుగా పార్లమెంట్ వెలుపల ఉన్న ఇద్దరిని కూడా అరెస్టు చేశారని ఓం బిర్లా పేర్కొన్నారు. ఈ అంశంపై చర్చించాలని సభ్యులు పట్టుబట్టడంతో కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరిని మాట్లాడేందుకు అనుమతించారు. ఆ సమయంలో మాట్లాడిన అధీర్ రంజన్ చౌదరి.. 2001లో పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన వార్షికోత్సవాన్ని నేడు జరుపుకుంటున్నాం. ఆ దాడిలో అమరులైన అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్ ఆవరణలో దాడి జరిగింది. ఇది 2001లో జరిగినటువంటి దాడి కాదని నేను అంగీకరిస్తున్నానన్నారు. అయితే ఉన్నత స్థాయి భద్రత విఫలమైందని చెప్పారు. ఎంపీలంతా ధైర్యంగా వ్యవహరించి వీరిద్దరిని పట్టుకున్నారు. అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు భద్రతా అధికారులు ఎక్కడికి వెళ్లారని అధిర్ రంజన్ చౌదరి ప్రశ్నించాడు.
Also Read: Parliament: ఇది సాధారణ పొగ: లోక్‌సభ ఘటనపై స్పీకర్ ఓం బిర్లా వివరణ..