HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Attack On Fake Voters Before Casting Their Vote

ముందు గుర్తింపు.. తర్వాతే ఓటు.. రాజస్థాన్ ఎన్నికల కమిషన్ కొత్త నిబంధన!

ఎన్నికల కమిషన్ జారీ చేసిన 14 అంశాల మార్గదర్శకాల ప్రకారం.. ముసుగు ధరించిన మహిళలను గుర్తించడానికి ప్రిసైడింగ్ అధికారులు స్థానిక మహిళా ఉద్యోగుల సహాయం తీసుకోవచ్చు.

  • Author : Gopichand Date : 27-12-2025 - 7:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fake Voters
Fake Voters

Fake Voters: రాజస్థాన్ పంచాయితీ రాజ్ ఎన్నికల సన్నాహాల వేళ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఒక కఠినమైన ఆదేశం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. రాజస్థాన్ పంచాయితీ ఎన్నికల్లో పారదర్శకతను పెంచేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓటు వేయడానికి వచ్చే ముసుగు లేదా బుర్కా ధరించిన మహిళా ఓటర్లు, ఓటు వేయడానికి ముందు తమ ముఖాన్ని చూపించి గుర్తింపును ధృవీకరించుకోవాలి. నిష్పక్షపాత ఎన్నికలకు ఓటరు సరైన గుర్తింపు తప్పనిసరని కమిషన్ స్పష్టం చేసింది.

ప్రభుత్వ వాదన- ఉద్దేశం

రాజస్థాన్ స్వయంప్రతిపత్తి పాలన శాఖ మంత్రి ఝబ్బర్ సింగ్ ఖర్రా ఈ నిర్ణయాన్ని సమర్థించారు. గత కొన్ని ఎన్నికలలో ముసుగు లేదా బుర్కా మాటున ఫేక్ ఓటింగ్ (దొంగ ఓట్లు) జరుగుతున్నట్లు గమనించామని ఆయన తెలిపారు. దీనిని అరికట్టడానికే ఈ నిబంధన తెచ్చామని, అంగన్‌వాడీ, ఆరోగ్య శాఖలో పనిచేసే మహిళా సిబ్బంది ద్వారా ఈ గుర్తింపు ప్రక్రియను నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

Also Read: 2026లో కూడా భారత్- పాకిస్థాన్ మ‌ధ్య హోరాహోరీ మ్యాచ్‌లు!

కాంగ్రెస్ అభ్యంతరం, ఆందోళన

ఈ నిబంధనపై కాంగ్రెస్ పార్టీ, రాజస్థాన్ మహిళా కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సారికా సింగ్ మాట్లాడుతూ.. ఈ నిబంధన రాజ్యాంగంలోని అధికరణ 14, 15 (వివక్షకు వ్యతిరేక హక్కు)ను ఉల్లంఘిస్తోందని విమర్శించారు. ఎన్నికల విధులకు మహిళా సిబ్బందిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలనే మరో ప్రతిపాదనను కూడా ఆమె తప్పుపట్టారు. ఇది మహిళలను తక్కువ చేసి చూడటమేనని, వెంటనే ఈ నిబంధనలను ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రాజస్థాన్ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ముసుగు లేకుండా బయటకు రావడం కష్టమని, ఈ నిబంధన వల్ల చాలామంది ఓటు వేయడానికి రాకపోవచ్చని కాంగ్రెస్ వాదిస్తోంది.

కొత్త నిబంధన అమలు ఎలా ఉంటుంది?

ఎన్నికల కమిషన్ జారీ చేసిన 14 అంశాల మార్గదర్శకాల ప్రకారం.. ముసుగు ధరించిన మహిళలను గుర్తించడానికి ప్రిసైడింగ్ అధికారులు స్థానిక మహిళా ఉద్యోగుల సహాయం తీసుకోవచ్చు. మహిళా సిబ్బంది సమక్షంలో ముసుగు తొలగించి గుర్తింపును నిర్ధారించుకున్న తర్వాతే ఓటు వేయడానికి అనుమతిస్తారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి లోపాలు జరగకుండా చూసే బాధ్యతను జిల్లా ఎన్నికల అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం అధికార పక్షం (బీజేపీ) పారదర్శకత పేరుతో ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, విపక్షం (కాంగ్రెస్) దీనిని మహిళల హక్కులకు భంగమని పోరాడుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fake Voters
  • national news
  • rajasthan
  • Rajasthan News
  • voters
  • voting

Related News

PM Modi

లక్నోలో ‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ!

ఈ కేంద్రం ఆత్మగౌరవం, ఐక్యత, సేవకు చిహ్నమని ప్రధాని అభివర్ణించారు. అక్కడ ఏర్పాటు చేసిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజపేయిల భారీ విగ్రహాలు దేశ నిర్మాణానికి నిరంతరం స్ఫూర్తినిస్తాయని చెప్పారు.

  • Aravalli

    అరావళి పర్వతాల్లో మైనింగ్‌పై కేంద్రం నిషేధం!

  • Airlines

    భారత విమానయాన రంగంలోకి కొత్తగా మూడు ఎయిర్‌లైన్స్!

  • New Tax Rules

    ఏప్రిల్ 1 నుండి మీ ఫోన్, సోషల్ మీడియాపై నిఘా? వైరల్ వార్తలో నిజమెంత?

  • Aravalli

    ఆరావళి పర్వతాల పరిరక్షణపై ఆందోళన.. సుప్రీంకోర్టు తీర్పుతో 100 గ్రామాలపై ముప్పు!

Latest News

  • న్యూజిలాండ్ వన్డే సిరీస్.. టీమ్ ఇండియా ఎంపికపై 5 కీలక అప్‌డేట్స్ ఇవే!

  • ఉగ్రవాదుల ఏరివేతకు భారత సైన్యం వింటర్ ఆపరేషన్!

  • ముందు గుర్తింపు.. తర్వాతే ఓటు.. రాజస్థాన్ ఎన్నికల కమిషన్ కొత్త నిబంధన!

  • 2026లో కూడా భారత్- పాకిస్థాన్ మ‌ధ్య హోరాహోరీ మ్యాచ్‌లు!

  • చెవిలో శబ్దాలు వస్తుంటే ఏం చేయాలి?

Trending News

    • అంపైర్ల జీతాల పెంపు నిర్ణయం వాయిదా వేసిన బీసీసీఐ!

    • ఈ ఏడాది గంభీర్ కోచింగ్‌లో భారత జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ఎలా ఉందంటే?!

    • న్యూజిలాండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధం.. కెప్టెన్సీ బాధ్యతలు అత‌నికే!

    • చైనా ఆయుధాల వైఫల్యం.. పేలిపోయిన రాకెట్ సిస్టమ్!

    • పిజ్జా వదిలేసి.. మటన్ ప్రియుడిగా మారిన టీమిండియా యంగ్ క్రికెట‌ర్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd