రెండేళ్ల క్రితం మహిళా పైలట్ల పై అజిత్ పవార్.. వైరల్ అవుతున్న పాత ట్వీట్
- Author : Vamsi Chowdary Korata
Date : 28-01-2026 - 5:33 IST
Published By : Hashtagu Telugu Desk
Ajit Pawar మహారాష్ట్ర రాజకీయాల్లో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం బారామతి విమానాశ్రయం సమీపంలో ఈరోజు ఉదయం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ తో పాటు విమానంలో ఉన్న మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

Ajit Pawar Old Tweet
ఈ విషాద సమయంలో అజిత్ పవార్ 2024లో చేసిన ఒక పాత ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమాన ప్రయాణాలు, సురక్షిత ల్యాండింగ్ గురించి ఆయన చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ కలచివేస్తున్నాయి.
“మనం హెలికాప్టర్ లేదా విమానంలో ప్రయాణించేటప్పుడు, అది సురక్షితంగా ల్యాండ్ అయితే ఆ పైలట్ ఒక మహిళ అని అర్థం చేసుకోవాలి” అని ఆయన ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత విమానం ల్యాండ్ అవుతున్న సమయంలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం ఒక విధి వైపరీత్యమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.