HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >A Massive Snowstorm In Jammu And Kashmir

జమ్మూ కాశ్మీర్ లో భారీ మంచు తుపాను

  • Author : Vamsi Chowdary Korata Date : 28-01-2026 - 11:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
J&K Avalanche Caught On CCTV
J&K Avalanche Caught On CCTV

Jammu Kashmir  జమ్మూ కశ్మీర్ లోని ఓ రిసార్ట్ ను భారీ అవలాంచీ ముంచెత్తింది. అలల్లాగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మంచు.. రిసార్ట్ తో పాటు చుట్టుపక్కల భవనాలనూ కమ్మేసింది. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ భయానక ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. జమ్మూ కశ్మీర్ ను వెంటాడుతున్న మంచు తుపాన్ కారణంగా ఈ అవలాంచీ ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఏకధాటిగా కురుస్తున్న మంచు ఒక్కసారిగా రిసార్ట్ ను ముంచెత్తిందని చెప్పారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వివరించారు.

జమ్మూ కశ్మీర్ లో దాదాపు అన్నిచోట్లా అత్యంత కఠిన వాతావరణం నెలకొంది. ఓవైపు మంచు విపరీతంగా కురుస్తుండడంతో పాటు.. మరోవైపు చలిగాలులు అక్కడి ప్రజలను వణికిస్తున్నాయి. శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్, అనంతనాగ్, కార్గిల్, సోన్‌మార్గ్, కుప్వారా, పుల్వామా, బేతాబ్ వ్యాలీ, పట్నిటాప్, పూంఛ్, కిష్టవార్.. ఇలా అన్నిచోట్లా హిమపాతం కురుస్తోంది. రోడ్ల మీద అడుగులకొద్దీ మంచు పేరుకుపోతోంది. చెట్లు, ఇళ్ల పైకప్పులపై దట్టంగా మంచు పేరుకుపోయింది. కాగా, ఉత్తరాఖండ్‌ లోని పలు ఎత్తైన ప్రాంతాలకు కూడా వాతావారణ శాఖ అధికారులు అవలాంచీ హెచ్చరికలు జారీ చేశారు. బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ సహా పలు ప్రాంతాల్లో హిమపాతం కారణంగా ఈ హెచ్చరికలు జారీ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Avalanche
  • Avalanche video
  • Avalanche warning
  • Badri Nath
  • Gulmarg
  • jammu kashmir
  • kashmir snowfall
  • Kedarnath
  • snowfall
  • Srinagar
  • uttarakhand

Related News

After decades of silence, Raghunath Temple in Srinagar, J&K has finally been reopened for devotees after 36 years.

Raghunath Temple: 36 ఏళ్ల తర్వాత శ్రీనగర్‌లో తెరుచుకున్న రఘునాథ మందిరం

కశ్మీర్ లోయలో మూడున్నర దశాబ్దాల క్రితం మూతపడిన ఓ చారిత్రక హిందూ దేవాలయం తిరిగి తెరుచుకుంది. ఉగ్రవాదం కారణంగా మూతపడిన శ్రీనగర్‌లోని హబ్బాకడల్ ప్రాంతంలో ఉన్న రఘునాథ్ మందిరాన్ని రామ నవమి పర్వదినం సందర్భంగా పునఃప్రారంభించారు. 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఈ వేడుకల్లో కశ్మీరీ పండిట్లు, స్థానిక ముస్లింలు, పౌర, పోలీసు శాఖల అధికారులు పాల్గొని మత సామరస్యాన్ని చాటారు. ఈ

    Latest News

    • Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌కు కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్ పాండ్యా

    • Lokesh : టీడీపీ ఫ్యూచర్ బాస్.. నారా లోకేషే !!

    • Amaravati Inner Ring Road Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

    • TVK Party: పెరంబూర్ నుండి నామినేషన్ దాఖలు చేసిన దళపతి విజయ్

    • ప్రకాష్ రాజ్ తల్లి మృతి..పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ ..ఇదే కదా పవన్ అంటే !!

    Trending News

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

      • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

      • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd