HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >A Volcano Erupted After 12000 Years Ash Engulfed Those Countries

Hayli Gubbi Volcano in Ethiopia : 12 వేల ఏళ్ల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం.. ఆ దేశాలను కమ్మేసిన బూడిద!

  • By Vamsi Chowdary Korata Published Date - 01:47 PM, Tue - 25 November 25
  • daily-hunt
Hayli Gubbi Volcano
Hayli Gubbi Volcano

ఆఫ్రికాలోని థియోపియాలో 12 వేల ఏళ్ల తర్వాత తొలిసారి హేలీ గుబ్బీ అగ్నిపర్వతం తాజాగా బద్దలైంది. దీనివల్ల వచ్చిన బూడిద, పొగలు భారత్‌తో సహా పలు దేశాల్లోని విమాన సర్వీసులకు అంతరాయం కలిగించాయి. ఢిల్లీతో పాటు ఉత్తర భారత దేశాన్ని దీని బూడిద కమ్మేసింది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా విమానయాన సంస్థలు పలు సర్వీసులను రద్దు చేశాయి. ఈ బూడిదలో సల్ఫర్ డయాక్సైడ్ అధిక శాతం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.

⚠️ Ethiopia: The Hayli Gobi volcano erupted today for the first time in ten thousand years and sent ash up to a height of 15 km.🔥🔥 pic.twitter.com/aiPVhhO4rr

— Dr. Fundji Benedict (@Fundji3) November 24, 2025

ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో ఓ అగ్నిపర్వతం దాదాపు 12 వేల ఏళ్ల తర్వాత మొదటిసారి బదలైంది. నవంబరు 23న జరిగిన భారీ విస్ఫోటం కారణంగా పెద్దఎత్తున బూడిద, పొగలు కక్కుతూ ఇది లావా విరజిమ్ముతోంది. బూడిద కొన్ని వేల మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో భారత సహా పలు దేశాల్లోని విమాన సర్వీసులపై ప్రభావం పడుతోంది. ఉత్తర ఇథియోపియాలోని హేలీ గుబ్బీ అగ్నిపర్వతం బద్దలవడంతో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల కారణంగా భారత్ సహా పలు దేశాలను భారీగా బూడిద కమ్మేసింది. ఇప్పటికే వాయు కాలుష్యంతో సతమతమవుతోన్న ఢిల్లీ పరిసరాలకు ఈ బూడిద చేరుకుంది. దీంతో విమాన రాకకపోలకు అంతరాయం ఏర్పడింది.

సోమవారం తొలుత గుజరాత్‌లోకి ప్రవేశించిన ఈ బూడిద క్రమంగా రాజస్ధాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లకు చేరింది. బూడిద మేఘాలు చైనావైపుగా పయనిస్తున్నాయని, రాత్రి 7.30 గంటల తర్వాత భారత గగనతలం నుంచి దూరంగా వెళ్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ‘‘అధిక తీవ్రత గాలులు ఇథియోపియా నుంచి ఎర్ర సముద్రం మీదుగా యెమెన్, ఒమన్ వరకు.. అరేబియా సముద్రం మీదుగా పశ్చిమ, ఉత్తర భారతదేశం వైపు బూడిద మేఘాలను మోసుకెళ్లాయి’’ అని ఐఎండీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక సూచనలు జారీచేసింది. అగ్నిపర్వత బూడిత ప్రభావిత ప్రాంతాలకు విమాన సర్వీసులు నిలిపివేయాలని, తాజా సూచనలకు అనుగుణంగా ప్రయాణ ప్రణాళిక, రూటింగ్, ఇంధన పరిమితిని సర్దుబాటు చేయాలని కోరింది. ఈ ప్రభావం ఎయిరిండియా, ఇండిగో, స్పైస్‌జెట్ సహా పలు సంస్థల సర్వీసులపై పడింది.

హేలి గుబ్బీ అగ్నిపర్వత విస్ఫోటనం తర్వాత కొన్ని ప్రాంతాలకు ముందజాగ్రత్త చర్యల్లో భాగంగా 11 విమానాలను రద్దు చేసినట్లు ఎయిరిండియా తెలిపింది. రద్దయిన వాటిలో నెవార్క్- న్యూఢిల్లీ, న్యూయార్క్- న్యూఢిల్లీ, దుబాయ్- హైదరాబాద్, దోహా- ముంబి, దుబాయ్- చెన్నై, దమామ్ (సౌదీ)- ముంబి, దోహా-ఢిల్లీ, చెన్నై- ముంబయి, హైదరాబాద్- ఢిల్లీ విమానాలు ఉన్నాయి.

Update04:
The Ash cloud from #HayliGubbi volcano that erupted y’day about to reach #Delhi & #NCR and adjoining areas of #Haryana, #Punjab and #UttarPradesh in ~10 to 30 minutes. This mostly consists of SO2 and moderate concentrations of Volcanic Ash. The plume does not possess… https://t.co/ESm1xzrJDb pic.twitter.com/IGfC97LecZ

— IndiaMetSky Weather (@indiametsky) November 24, 2025

ఊహించని పరిస్థితుల వల్ల ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం.. కానీ, ప్రయాణీకులు, సిబ్బంది భద్రతకే మా అత్యున్నత ప్రాధాన్యత’ అని ఎయిరిండియా ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొంది. ఇండిగో సైతం ప్రయాణీకుల భద్రత కోసం అవసరమైన చర్యలతో పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

ఈ ధూళిలో ఎక్కువ మొత్తంలో సల్ఫర్ డయాక్సైడ్, మితమైన సాంద్రత కలిగిన అగ్నిపర్వత బూడిద ఉంటుందని వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. ‘‘ఇది వాయు నాణ్యత సూచిక స్థాయిలను ప్రభావితం చేయదు.. కానీ నేపాల్, హిమాలయాలు, ఉత్తరప్రదేశ్‌ పక్కనే ఉన్న టెరాయ్ బెల్ట్‌లోని కొండలలో SO2 స్థాయిలను ప్రభావితం చేస్తుంది.. ఎందుకంటే కొన్ని పదార్థాలు కొండలను ఢీకొట్టి తరువాత చైనాలోకి ప్రవేశిస్తాయి’’ అని చెప్పారు.

హేలి గుబ్బీ అగ్నిపర్వతం విస్ఫోటనం తర్వాత పొగ, బూడిద నింగిలోకి 14 కిలోమీటర్ల ఎత్తునకు చేరుకుని, అనేక గ్రామాలపై ఆవరించింది. దాదాపు 500 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ అగ్నిపర్వతం , రెండు టెక్టోనిక్ ప్లేట్లు కలిసే తీవ్ర భౌగోళిక కార్యకలాపాల జోన్ రిఫ్ట్ వ్యాలీలో ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AQI
  • delhi
  • Delhi AQI
  • gujarat
  • haryana
  • Hayli Gubbi Volcano in Ethiopia
  • maharastra
  • punjab
  • rajasthan
  • uttarakhand
  • uttarpradesh
  • Volcanic Ash
  • warning

Related News

Bank

Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

పీటీఐ (PTI) ప్రకారం.. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మంగళవారం మూసి ఉంటాయి. ప్రైవేట్ పాఠశాలలు, అన్ని ప్రభుత్వ పాఠశాలలు మూసి ఉంటాయి.

  • Gujarat CM

    Gujarat CM: ప్రజల కోసం సీఎం సంచలన నిర్ణయం.. పెళ్లి కోసం బహిరంగ సభ వేదిక మార్పు!

  • Toxic Air

    Toxic Air: ఢిల్లీలో వాయు కాలుష్యం.. ఆ ఉద్యోగులకు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌!

  • Student Suicide Case

    Shocking Facts : జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

  • Delhi Blast

    Delhi Blast: ఢిల్లీ రెడ్ ఫోర్ట్ పేలుడు కేసులో కీలక విషయాలు వెల్లడి!

Latest News

  • Nara Lokesh: విద్యాశాఖ మంత్రి సమక్షంలో పసిమొగ్గల ఆనందం!

  • Nepal Currency: ఇకపై చైనాలో నేపాల్ కరెన్సీ ముద్రణ.. భారతదేశం ఎందుకు వైదొలిగింది?

  • BRS : బిఆర్ఎస్ పార్టీకి భారీగా నిధుల కొరత

  • Ayodhya Ram Temple : ప్రధాని చేతుల మీదుగా వైభవంగా ధ్వజారోహణం!

  • Parimal Nathwani : వైసీపీ ఎంపీ కొడుకు పెళ్లికి హాజరైన అతిరధ మహారథులు ..ముకేశ్ అంబానీ దంపతులు!

Trending News

    • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

    • Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

    • Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

    • Punjabi Cremation: ధర్మేంద్రకు తుది వీడ్కోలు.. సిక్కు సంప్రదాయంలో అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారంటే?

    • Karun Nair: కరుణ్ నాయర్ కీల‌క వ్యాఖ్యలు.. టీమిండియా పైనేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd