HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >400 Lok Sabha Seats For Bjp Is Impossible Its Not Existing In Three Big States Kharge

400 Lok Sabha Seats : బీజేపీకి 400 పార్ అసాధ్యం.. ఎందుకో చెప్పిన ఖర్గే

ఈ ఎన్నికల్లో బీజేపీకి 400 లోక్‌సభ సీట్లు రావడం అసాధ్యమని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జోస్యం చెప్పారు.

  • By Pasha Published Date - 08:33 PM, Tue - 28 May 24
  • daily-hunt
Modi Vs Kharge

400 Lok Sabha Seats : ఈ ఎన్నికల్లో బీజేపీకి 400 లోక్‌సభ సీట్లు రావడం అసాధ్యమని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జోస్యం చెప్పారు. బీజేపీ చెబుతున్న విధంగా 400 పార్(400 Lok Sabha Seats) అనేది ఆషామాషీ విషయం కాదన్నారు. తెలంగాణ, తమిళనాడు, కేరళలో బీజేపీ ఊసే లేదని ఆయన పేర్కొన్నారు. కీలకమైన మూడు రాష్ట్రాల్లో అస్సలు జాడే లేని బీజేపీకి 400 సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. దక్షిణాదిలో బీజేపీకి గుండా సున్నా తప్ప ఇంకేం రాదని ఖర్గే చెప్పారు. మంగళవారం అమృత్‌సర్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఖర్గే ఈ కామెంట్స్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గబోతున్నాయి. ఆ సీట్లన్నీ ఇండియా కూటమి పార్టీల ఖాతాలో చేరడం ఖాయం. కర్ణాటకలో బీజేపీ బలహీనపడింది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, ఒడిశాలలో ఆ పార్టీ పోటీ ఇస్తోంది. కీలకమైన రాష్ట్రాల్లో అంత బలంగా  లేనప్పుడు 400 లోక్‌సభ సీట్లు ఎలా వస్తాయి ? ఏ లెక్కన చూసుకున్నా బీజేపీకి 200 లోక్‌సభ సీట్లు కూడా రావు’’ అని ఖర్గే పేర్కొన్నారు.

Also Read : PM Modi Meditation : కన్యాకుమారిలో రెండు రోజులు ప్రధాని మోడీ మెడిటేషన్

ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోతే ఖర్గే ఉద్యోగం ఊడిపోతుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన కామెంట్‌పై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను ఉద్యోగం కోసం రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలకు సేవ చేసుకునేందుకే వచ్చా. జూన్‌ 4 తర్వాత షా.. తన ఉద్యోగం గురించి ఆలోచించుకోవాలి’’ అని కాంగ్రెస్ చీఫ్ హితవు పలికారు. ‘‘ప్రధాని మోడీకి.. మాజీ ప్రధాని మన్మోహన్‌కు చాలా తేడా ఉంది. మోడీ దేశ ప్రజలకు తక్కువ సేవ చేస్తారు. కానీ ఎక్కువగా చెప్పుకుంటారు. మాజీ ప్రధాని మన్మోహన్ ఎంత చేసినా.. ఏం చెప్పుకోలేదు. మన్మోహన్ హయాంలో రూ.72 వేల కోట్ల వ్యవసాయ రుణాలను ఇచ్చారు. అయినా వాటి గురించి మన్మోహన్ గొప్పగా చెప్పుకోలేదు’’ అని ఖర్గే చెప్పుకొచ్చారు.

Also Read : 110 Voters : ఆ ఫ్యామిలీలో 165 మంది.. ఓట్ల కోసం లీడర్ల క్యూ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 400 Lok Sabha Seats
  • bjp
  • congress
  • Kharge
  • lok sabha

Related News

Jublihils Campign

Jubilee Hills By Election : ఓటర్ల మద్దతు ఎవరికీ..టెన్షన్ టెన్షన్ అవుతున్న అభ్యర్థులు

Jubilee Hills By Election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల హీట్‌ రోజురోజుకీ పెరుగుతోంది. ఈ ఎన్నికలను కేవలం ఒక నియోజకవర్గ పోరు అని చెప్పడం సరైంది కాదు, ఇది మూడు ప్రధాన పార్టీల ప్రతిష్ఠాత్మక పోరాటంగా మారింది

  • Congress

    Congress: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. తప్పుడు ప్రచారాలపై కాంగ్రెస్ అప్రమత్తత!

  • DCC Presidents

    DCC Presidents: డీసీసీ అధ్యక్షుల నియామకంపై కొత్త నిబంధ‌న‌లు.. వారికి ప‌ద‌వులు క‌ష్ట‌మే!

  • Pm Modi In Bihar

    PM Modi: ప్రధాని మోదీ: బిహార్‌లో ఎన్‌డీఏ కూటమి అన్ని ఎన్నికల రికార్డులను బ్రేక్ చేస్తుంది!

  • Bihar Elections

    Bihar Elections: బీహార్ ఎన్నికలు 2025.. తొలి దశలో 467 నామినేషన్లు రద్దు!

Latest News

  • ‎Jujube: రేగి పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం!

  • ‎Hair Growth: పది రూపాయల పెరుగు ప్యాకెట్ తో ఇలా చేస్తే చాలు.. జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం ఖాయం!

  • ‎Leaves Benefits: ఈ చిన్ని ఆకులతో షుగర్ తగ్గడం నుంచి జుట్టు పెరగడం వరకు ఎన్నో లాభాలు!

  • Harish Rao Father Died : హరీశ్ రావు తండ్రి కన్నుమూత

  • ‎Weight Loss: ఇవి తింటే చాలు.. జిమ్ తో అవసరం లేకుండా పొట్టలో కొవ్వు కరిగిపోవడం ఖాయం!

Trending News

    • Shreyas Iyer In ICU: శ్రేయ‌స్ అయ్య‌ర్ ఐసీయూలో ఎందుకు ఉండాల్సి వ‌చ్చింది?

    • Cyclone Montha : మాన్సూన్ తుపాను ప్రభావం పై చంద్రబాబు నాయుడు ట్వీట్: ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు చేపట్టాం.!

    • Andhra pradesh : ఏపీ ప్రజలకు మొంథా తుపాన్ అలర్ట్.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!

    • Justice Surya Kant : హరియాణా నుంచి భారత్‌లో తొలి ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్.!

    • Burn Utensils: మాడిపోయిన పాత్రలను ఈజీగా శుభ్రం చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd