Water Apple : వాటర్ ఆపిల్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకవ్వాల్సిందే?
ఈ వాటర్ యాపిల్ (Water Apple) చెట్టు దాదాపు పది అడుగుల ఎత్తు వరకు పెరగడంతో పాటు ఒక చెట్టుకు 500 నుంచి దాదాపు 1000 పండ్ల వరకు కాస్తాయి.
- Author : Naresh Kumar
Date : 18-11-2023 - 5:50 IST
Published By : Hashtagu Telugu Desk
Water Apple : వాటర్ యాపిల్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మనలో చాలామంది ఈ వాటర్ యాపిల్ (Water Apple) పండును తిని ఉండరు. ఇంకా చెప్పాలంటే చాలామంది ఈ పండుని చూసి కూడా ఉండరు అని చెప్పవచ్చు. ఈ పండు చూడడానికి గులాబీ రంగులో ఉండి మనకు చూడడానికి జీడి మామిడిపండు లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వాటర్ యాపిల్ కేవలం సీజన్ లో మాత్రమే పండుతాయి. ఎక్కువగా మనకు డిసెంబర్ జనవరి నెలల్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయి. ఈ మొక్కలు మనకు నర్సరీ లలో కూడా అందుబాటులో ఉంటాయి. కాగా ఈ వాటర్ యాపిల్ (Water Apple) చెట్టు దాదాపు పది అడుగుల ఎత్తు వరకు పెరగడంతో పాటు ఒక చెట్టుకు 500 నుంచి దాదాపు 1000 పండ్ల వరకు కాస్తాయి.
We’re Now on WhatsApp. Click to Join.
వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి వన్, కాల్షియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. అలాగే విటమిన్ బి టు రైబో ఫ్లెవెన్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింకు, విటమిన్లు ఉన్నాయి. ఎన్నోరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి వాటర్ ఆపిల్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల విషయానికొస్తే.. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్ ,ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటు వ్యాధులు ప్రబలకుండా చేస్తుంది. వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, క్షయవ్యాధి, టీవీ స్పాంజ్లా ఉండే ఊపిరితిత్తులు గడ్డకట్టుకునే నిమోనియా లాంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. అలాగే వైరస్ ల వల్ల సంక్రమించే వ్యాధులను అడ్డుకట్ట వేస్తుంది.
గ్యాస్ ట్రబుల్ ను కూడా నివారిస్తుంది. దీనిలో పీచు కూడా ఉంటుంది. పీచు వల్ల దీన్ని పైన ఉన్న తోలుతో పాటు తినాలి. కోస్తే లోపల గింజ ఉండదు కాబట్టి తోలుతో సహా కండ కూడా తినొచ్చు. రుచి కూడా బాగానే ఉంటుంది. మలబద్ధకం ఉన్నవారికి మొలలు మూలశంక పైల్స్ వచ్చే అవకాశం ఉంది. వీటిని తినడం వల్ల ఆ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే అందులో ఉండే విటమిన్ ఏ ప్రభావం వల్ల కంటి ఆరోగ్యం కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అలాగే ఈ చెట్టు నాటిన తర్వాత కాపు రావడానికి మనకు మూడు సంవత్సరాల సమయం పడుతుంది.
Also Read: Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ రెండు బైక్‌ల ధర ఎంతో తెలుసా.. వాటి ఫీచర్లు ఇవే..!