Weight Loss : బరువు తగ్గడానికి ఏది మంచిది?..రన్నింగ్ లేదా వాకింగ్!
- By Vamsi Chowdary Korata Published Date - 02:19 PM, Fri - 21 November 25
పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు వల్ల ఆరోగ్య సమస్యలే కాదు.. మనకు మనం క్యారీ చేసుకోవడమూ కష్టంగా, ఇబ్బందిగానే ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు.. ఎంచుకునే ఈజీ వ్యాయామాల్లో వాకింగ్, రన్నింగ్ మొదటి ఆప్షన్‌లో ఉంటాయి. అయితే.. వాకింగ్, రన్నింగ్‌లో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించడానికి ఏది ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయో చాలామందికి డౌట్ ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ త్వరగా కరగడానికి ఏది బాగా సహాయపడుతుందో ఈ స్టోరీలో చూసేయండి.
బెల్లీ ఫ్యాట్.. ప్రస్తుతం చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు వల్ల ఆరోగ్య సమస్యలే కాదు.. మనకు మనం క్యారీ చేసుకోవడమూ కష్టంగా, ఇబ్బందిగానే ఉంటుంది. ఫొటొ దిగాలంటే.. ఊపిరి బిగపట్టి బొజ్జ వెనక్కిలాగాల్సి వస్తోంది. అద్దం ముందు నిల్చుంటే పొట్ట ఏమిటిరా.. ఇలా పెరిగిపోయింది.. అని మనకు మనమే అసహ్యించుకుంటాం. బెల్లీ ఫ్యాట్ ఎలా అయినా కరిగించాలని కొంతమంది.. జిమ్‌లకు వెళ్లి.. కష్టమైన వర్క్‌అవుట్స్‌తో చెమట చిందిస్తూ ఉంటారు. కొంతమంది సింపుల్ ఎక్స్‌రసైజ్‌లు చేస్తుంటారు. అందులో చాలా మంది ఇష్టపడేది.. కష్టం లేకుండా చేసేది వాకింగ్, రన్నింగ్.
వాకింగ్, రన్నింగ్ గుండె ఆరోగ్యానికీ, స్ట్రెస్ తగ్గించడానికీ, ఫిట్‌నెస్ మెరుగుపరచడానికీ ఎఫెక్టివ్‌గా సాయపడతాయి. అయితే.. వాకింగ్, రన్నింగ్‌లో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించడానికి ఏది ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయో చాలామందికి డౌట్ ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ త్వరగా కరగడానికి ఏది బాగా సహాయపడుతుందో ఈ స్టోరీలో చూసేయండి.
బెల్లీ ఫ్యాట్ త్వరగా కరగాలంటే నడవడం కంటే రన్నింగే సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. నడిస్తే కంటే పరిగెడితే రెండింతలు ఎక్కువగా క్యాలరీలు కరుగుతాయి, పరిగెట్టడం ఆపిన తర్వాత కూడా క్యాలరీలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ ఆరోగ్యానికి మంచిదే అయినా మీ టార్గెట్ పొట్ట కరగడం అయితే రన్నింగే బెస్ట్ అని అంటున్నారు.
పరుగు అనేది అధిక-ప్రభావవంతమైన, అధిక-తీవ్రత కలిగిన వ్యాయామం, ఇది మీ శరీరం తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని ఉపయోగించుకునేలా చేస్తుంది. జర్నల్ ఆఫ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ రీసెర్చ్‌లో ప్రచురించి ఒక అధ్యయనం ప్రకారం.. నడిస్తే కంటే పరిగెడితే రెండితలు ఎక్కువగా క్యాలరీలు కరుగుతాయి. రన్నింగ్ హార్ట్ బీట్ రేటును పెంచుతుంది, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును ఇంధనంగా ఉపయోగించుకుంటుంది.
రోజూ రన్నింగ్ చేయడం వల్ల ఏర్పడే స్థిరమైన కేలరీల లోటు ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. రన్నింగ్ కొవ్వు జీవక్రియను వేగవంతం చేస్తుందని నిపుణులు అంటున్నారు ముఖ్యంగా పొత్తికడుపు ప్రాంతంలో పేరుకున్న కొవ్వు జీవక్రియను వేగవంతం చేసి త్వరగా కరిగేలా చేస్తుంది. ఇది మొత్తం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
పరిగెత్తడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి “ఆఫ్టర్‌బర్న్ ఎఫెక్ట్”, దీనిని శాస్త్రీయంగా అదనపు పోస్ట్-ఎక్సెర్సైజ్ ఆక్సిజన్ వినియోగం (EPOC) అని పిలుస్తారు. రన్నింగ్ వంటి అధిక తీవ్రత కలిగిన వ్యాయామం చేసిన చాలా సేపు తర్వాత కూడా, మన శరీరం ఆక్సిజన్ స్థాయిలను పునరుద్ధరించడాని, కండరాలను మరమ్మతు చేయడానికిఅధిక రేటుతో కేలరీలను బర్న్ చేస్తూనే ఉంటుంది. వాకింగ్‌లో ఇంత స్థాయిలో క్యాలరీ బర్నింగ్ ఉండదు.
రన్నింగ్ బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేసినా ఇది అందరికీ సరిపోదు. రన్నింగ్ హై ఇంటెన్సిటీ వర్క్‌అవుట్ కాబట్టి.. మోకాలు, చీలమండలు, తుంటిపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. వర్క్‌అవుట్ ఇప్పుడిప్పుడే ప్రారంభించే వాళ్లు, వృద్ధులు, కీళ్ల సమస్యలు ఉన్నవాళ్లు.. నిధానంగా పరుగును భాగంగా చేసుకోవాలి.
గాయాలను నివారించడానికి సరైన వార్మప్‌లు చేయాలి, మంచి షూస్ వేసుకోవాలి, రన్నింగ్ చేసిన తర్వత స్ట్రెచ్చింగ్ చేయడం చాలా అవసరం. మీకు రన్నింగ్ కష్టంగా అనిపిస్తే.. కేలరీలను కరిగించడానికి స్పూడ్‌గా నడవండి, రన్నింగ్- వాకింగ్ రెండూ మీ వర్క్అవుట్‌లో భాగంగా చేసుకోండి.