HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Which Is Better For Weight Loss Running Or Walking

Weight Loss : బరువు తగ్గడానికి ఏది మంచిది?..రన్నింగ్ లేదా వాకింగ్!

  • Author : Vamsi Chowdary Korata Date : 21-11-2025 - 2:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Weight Loss Walking Running
Weight Loss Walking Running

పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు వల్ల ఆరోగ్య సమస్యలే కాదు.. మనకు మనం క్యారీ చేసుకోవడమూ కష్టంగా, ఇబ్బందిగానే ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు.. ఎంచుకునే ఈజీ వ్యాయామాల్లో వాకింగ్, రన్నింగ్‌ మొదటి ఆప్షన్‌లో ఉంటాయి. అయితే.. వాకింగ్‌, రన్నింగ్‌లో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించడానికి ఏది ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయో చాలామందికి డౌట్‌ ఉంటుంది. బెల్లీ ఫ్యాట్‌ త్వరగా కరగడానికి ఏది బాగా సహాయపడుతుందో ఈ స్టోరీలో చూసేయండి.

బెల్లీ ఫ్యాట్‌.. ప్రస్తుతం చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు వల్ల ఆరోగ్య సమస్యలే కాదు.. మనకు మనం క్యారీ చేసుకోవడమూ కష్టంగా, ఇబ్బందిగానే ఉంటుంది. ఫొటొ దిగాలంటే.. ఊపిరి బిగపట్టి బొజ్జ వెనక్కిలాగాల్సి వస్తోంది. అద్దం ముందు నిల్చుంటే పొట్ట ఏమిటిరా.. ఇలా పెరిగిపోయింది.. అని మనకు మనమే అసహ్యించుకుంటాం. బెల్లీ ఫ్యాట్ ఎలా అయినా కరిగించాలని కొంతమంది.. జిమ్‌లకు వెళ్లి.. కష్టమైన వర్క్‌అవుట్స్‌తో చెమట చిందిస్తూ ఉంటారు. కొంతమంది సింపుల్‌ ఎక్స్‌రసైజ్‌లు చేస్తుంటారు. అందులో చాలా మంది ఇష్టపడేది.. కష్టం లేకుండా చేసేది వాకింగ్‌, రన్నింగ్‌.

వాకింగ్‌, రన్నింగ్‌ గుండె ఆరోగ్యానికీ, స్ట్రెస్‌ తగ్గించడానికీ, ఫిట్‌నెస్‌ మెరుగుపరచడానికీ ఎఫెక్టివ్‌గా సాయపడతాయి. అయితే.. వాకింగ్‌, రన్నింగ్‌లో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించడానికి ఏది ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయో చాలామందికి డౌట్‌ ఉంటుంది. బెల్లీ ఫ్యాట్‌ త్వరగా కరగడానికి ఏది బాగా సహాయపడుతుందో ఈ స్టోరీలో చూసేయండి.

​బెల్లీ ఫ్యాట్‌ త్వరగా కరగాలంటే నడవడం కంటే రన్నింగే సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. నడిస్తే కంటే పరిగెడితే రెండింతలు ఎక్కువగా క్యాలరీలు కరుగుతాయి, పరిగెట్టడం ఆపిన తర్వాత కూడా క్యాలరీలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్‌ ఆరోగ్యానికి మంచిదే అయినా మీ టార్గెట్‌ పొట్ట కరగడం అయితే రన్నింగే బెస్ట్‌ అని అంటున్నారు.

​పరుగు అనేది అధిక-ప్రభావవంతమైన, అధిక-తీవ్రత కలిగిన వ్యాయామం, ఇది మీ శరీరం తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని ఉపయోగించుకునేలా చేస్తుంది. జర్నల్ ఆఫ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ రీసెర్చ్‌లో ప్రచురించి ఒక అధ్యయనం ప్రకారం.. నడిస్తే కంటే పరిగెడితే రెండితలు ఎక్కువగా క్యాలరీలు కరుగుతాయి. రన్నింగ్‌ హార్ట్‌ బీట్‌ రేటును పెంచుతుంది, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును ఇంధనంగా ఉపయోగించుకుంటుంది.

రోజూ రన్నింగ్‌ చేయడం వల్ల ఏర్పడే స్థిరమైన కేలరీల లోటు ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. రన్నింగ్ కొవ్వు జీవక్రియను వేగవంతం చేస్తుందని నిపుణులు అంటున్నారు ముఖ్యంగా పొత్తికడుపు ప్రాంతంలో పేరుకున్న కొవ్వు జీవక్రియను వేగవంతం చేసి త్వరగా కరిగేలా చేస్తుంది. ఇది మొత్తం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

పరిగెత్తడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి “ఆఫ్టర్‌బర్న్ ఎఫెక్ట్”, దీనిని శాస్త్రీయంగా అదనపు పోస్ట్-ఎక్సెర్సైజ్ ఆక్సిజన్ వినియోగం (EPOC) అని పిలుస్తారు. రన్నింగ్‌ వంటి అధిక తీవ్రత కలిగిన వ్యాయామం చేసిన చాలా సేపు తర్వాత కూడా, మన శరీరం ఆక్సిజన్ స్థాయిలను పునరుద్ధరించడాని, కండరాలను మరమ్మతు చేయడానికిఅధిక రేటుతో కేలరీలను బర్న్ చేస్తూనే ఉంటుంది. వాకింగ్‌లో ఇంత స్థాయిలో క్యాలరీ బర్నింగ్‌ ఉండదు.

రన్నింగ్‌ బెల్లీ ఫ్యాట్‌ కరిగించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేసినా ఇది అందరికీ సరిపోదు. రన్నింగ్‌ హై ఇంటెన్సిటీ వర్క్‌అవుట్‌ కాబట్టి.. మోకాలు, చీలమండలు, తుంటిపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. వర్క్‌అవుట్‌ ఇప్పుడిప్పుడే ప్రారంభించే వాళ్లు, వృద్ధులు, కీళ్ల సమస్యలు ఉన్నవాళ్లు.. నిధానంగా పరుగును భాగంగా చేసుకోవాలి.

గాయాలను నివారించడానికి సరైన వార్మప్‌లు చేయాలి, మంచి షూస్‌ వేసుకోవాలి, రన్నింగ్‌ చేసిన తర్వత స్ట్రెచ్చింగ్‌ చేయడం చాలా అవసరం. మీకు రన్నింగ్‌ కష్టంగా అనిపిస్తే.. కేలరీలను కరిగించడానికి స్పూడ్‌గా నడవండి, రన్నింగ్‌- వాకింగ్‌ రెండూ మీ వర్క్అవుట్‌లో భాగంగా చేసుకోండి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Benefits Of Weight Loss
  • Daily walking
  • Health Benfits
  • health tips
  • Lifesrtyle
  • running

Related News

Tulsi

Tulsi: ప్రతిరోజూ తులసి ఆకులు తినడం వల్ల ఇలాంటి లాభాలా?!

ప్రతిరోజూ తులసి ఆకులు తినడం వలన శరీరంలోని రోగనిరోధక శక్తి బలపడుతుంది. దీంతోపాటు ఒత్తిడి తగ్గడం మొదలవుతుంది. తులసి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

  • Breast Cancer

    Breast Cancer: రొమ్ము క్యాన్సర్.. ప్రారంభ లక్షణాలు, స్వీయ పరీక్ష విధానం ఇదే!

  • Kids Health

    ‎Kids Health: చిన్నపిల్లలకు దగ్గు జలుబు ఉన్నప్పుడు అరటిపండు పెట్టకూడదా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?

  • Heart Attack

    ‎Heart Attack: ఒంటరిగా ఉన్నప్పుడు గుండె నొప్పి వస్తే ఏం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు పాటించలో తెలుసా?

  • Health Tips Gas

    ‎Health Tips: గ్యాస్, కడుపులో మంటతో తెగ ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

Latest News

  • Ration Card : తెలంగాణ రేషన్‌ కార్డుదారులకు బిగ్‌షాక్..కేంద్రం ఇలా చేస్తుందని ఊహించరు

  • IndiGo Flight Disruptions : ఇండిగో ప్యాసింజర్లకు రూ.10 వేల విలువైన వోచర్లు

  • AP Cabinet Decisions : ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు

  • Akhanda 2 : ‘అఖండ-2’ కు మరో దెబ్బ..బాలయ్య కు ఎవరి దిష్టి తగిలిందో..?

  • IND vs SA: రెండో టీ20లో ఎవ‌రు గెలుస్తారు? టీమిండియా జోరు చూపుతుందా!

Trending News

    • Indigo Flight: ఇండిగో ప్రయాణికులకు రూ. 10,000 ట్రావెల్ వోచర్!!

    • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి కారణం ఏమిటి?

    • IPL Mini Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. అత్యధిక ధర పలికేది ఎవరికి?

    • Shreyas Iyer: ఐపీఎల్ వేలం టేబుల్‌పైకి శ్రేయ‌స్ అయ్య‌ర్‌!

    • IPL 2026 Purse: ఐపీఎల్ 2026 వేలం.. ఏ జట్టు దగ్గర ఎంత డబ్బుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd