HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Health
  • >What Is The Cause Of Arthritis

Cause of Arthritis : అర్థరైటిస్‌ రావడానికి కారణం ఏంటంటే..!

NCBI నివేదిక ప్రకారం, భారతదేశ జనాభాలో దాదాపు 22 నుంచి 39 శాతం మంది రుమాటిజంతో బాధపడుతున్నారు.

  • By Maheswara Rao Nadella Published Date - 06:00 PM, Mon - 12 December 22
  • daily-hunt
Arthritis NCBI
Arthritis

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆర్థరైటిస్ (Arthritis) సమస్యతో బాధపడుతున్నారు. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే దీని గురించి తెలుసు. అర్థరైటిస్‌ (Arthritis) అంటే కీళ నొప్పి. సాధారణంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్ల దగ్గర నొప్పి, వాపు, అవి గట్టిగా (స్టిఫ్‌గా) మారడాన్ని, ఆయా కీళ్లలో కదలికలు తగ్గడాన్ని ‘ఆర్థరైటిస్‌’ గా చెప్పవచ్చు. మన దేశంలో 180 మిలియన్లకు పైగా ఆర్థరైటిస్ కేసులు ఉన్నాయి. ఆర్థరైటిస్ సాధారణంగా రెండు రకాలు ఉంటుంది ఆస్టియో ఆర్థరైటిస్ (Osteo Arthritis), రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis). NCBI నివేదిక ప్రకారం, భారతదేశ జనాభాలో దాదాపు 22 నుంచి 39 శాతం మంది రుమాటిజంతో బాధపడుతున్నారు. పురుషుల కంటే మహిళలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

అర్థరైటిస్‌ ఎందుకు వస్తుంది?

How Osteoarthritis and Rheumatoid Arthritis Differ

అర్థరైటిస్‌ లో ప్రధానంగా ఆస్టియో ఆర్థరైటిస్ (Osteo Arthritis), రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అని రెండు రకాలు ఉంటాయి. వృద్ధాప్యంలో మోకాలు, తుంటి కీళ్లు అరగటం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ (Osteo Arthritis) వస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) లో రోగనిరోధకశక్తి ఎదురు తిరగడంవల్ల కీళ్ల దగ్గరున్న కణాలన్నీ ఇన్‌ఫ్లమేషన్‌ కి గురై వాచిపోతాయి. చేతులూ, వేళ్లూ, మణికట్టూ, కాళ్లూ ఇలా కీళ్ల భాగాలతోపాటు శరీరంలోని ఇతర కణజాలాలూ కండరాల మీదా దీని ప్రభావం ఉంటుంది. దాంతో పిత్తాశయం, ఊపిరితిత్తుల సమస్యలతోపాటు రక్తహీనత, లో బీ1, మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇన్ఫెక్షన్ల కారణంగా సొరియాటిక్‌, సెప్టిక్‌, థంబ్‌ వంటి ఇతరత్రా ఆర్థరైటిస్ వ్యాధులూ వస్తుంటాయి. వంశపారంపర్యంగాగానీ, ఆటలు ఆడేటప్పుడు తగిలిన గాయాలవల్లో, ఊబకాయం కారణంగా కీళ్లమీద బరువు ఎక్కువ పడటం, పోషకాహార లోపం, శారీరక శ్రమ, కాల్షియంలోపం, నిద్రలేమి, జీవక్రియాలోపాలు, ఒత్తిడి, డిప్రెషన్‌…ఇలా అనేక కారణాల వల్ల ఆర్థరైటిస్ సమస్యలు వస్తుంటాయి.

లక్షణాలు:

Osteoarthritis in young people: it doesn't just affect the elderly | King Edward VII's Hospital

ఆర్థరైటిస్‌ లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. మొదటిదశలో ఆకలి తగ్గడం, జ్వరం, బాగా నీరసించి పోవడం, బరువు తగ్గడం వంటివి కనిపిస్తాయి. చేతులు, కాళ్లలోని కీళ్లలో నొప్పులు, వాపులు ఉంటాయి. కీళ్లు ఎర్రగా కమిలినట్లుగా ఉండి, విపరీతమైన నొప్పి వస్తాయి. ప్రత్యేకించి ఉదయం పూట నొప్పి ఉంటుంది.

వృద్ధులకే వస్తుందా?

How to Get Ahead of Age-Related Knee Pain: Advanced Spine and Pain: Orthopedic Specialists

ఆర్థరైటిస్‌లో చాలా రకాలు ఉన్నాయి. ఇది వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇది పిల్లలలో, యువకులనూ ప్రభావితం చేస్తుంది. పిల్లలలో జువైనల్‌ ఇడియోపతిక్‌ ఆర్థరైటిస్ వస్తుంది. ఇది 16 ఏళ్ల కన్నా చిన్నవారిలోనే వస్తుంటుంది. ఎక్కువగా 2-4 ఏళ్ల వయసులో కనిపిస్తుంటుంది. ఇది కీళ్లను శాశ్వతంగా దెబ్బతీస్తుంది.

అర్థరైటిస్‌ ఉంటే వ్యాయామం చేయవచ్చా?

Rheumatoid Arthritis: Try Strength Training as Part of Treatment | Everyday Health

అర్థరైటిస్‌ ఉన్నవారు వ్యయామం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. వ్యాయమం వాపు, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. కదలికలను, కీళ్ల బలాన్ని, ఫ్రెక్సిబిలటీని పెంచుతుంది. మీకు శారీరక శ్రమ లేకపోతే.. లక్షణాలు అధ్వాన్నంగా మారే అవకాశం ఉంది. ఏ వ్యాయామం చేసినా.. మీ లిమిట్‌ తెలుసుకోవడం మంచిది. ట్రైనర్‌ పర్యవేక్షణలో వ్యాయామం చేయండి.

హీట్‌ ప్యాడ్‌తో నొప్పి తగ్గుతుందా?

Hot Water Heater Bag

కూల్‌, హీట్‌ ప్యాడ్‌లు రెండూ కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తాయి. కూల్‌ ప్యాట్‌‌ కీళ్ల వాపు, నొప్పిని తగ్గిస్తుంది. మీకు కీళ్లు నొప్పిగా ఉన్నప్పుడు, వ్యాయామం చేసే ముందు హీట్‌ ప్యాట్‌ పెట్టుకుంటే రిలీఫ్‌గా ఉంటుంది.

ఈ ఆసనాలు వేయండి:

9 Yoga Poses for Ankylosing Spondylitis | Everyday Health

అర్థరైటిస్‌ సమస్యతో బాధపడేవారు యోగా ప్రాక్టిస్‌ చేసినా రిలీఫ్ లభిస్తుంది. మార్జారాసనం, త్రికోణాసనం, వృక్షాసనం, సేతుబంధాసనం, వజ్రాసనం, ఆంజనేయాసనం, కుక్కుతాసనం కూడా ఆర్థరైటిస్‌ పేషెంట్స్‌కు మేలు చేస్తాయిని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా యోగాసనాన్ని ప్రారంభించే ముందు, మీ వైద్యుడిని సంప్రదించండి.

ఆలివ్‌ ఆయిల్ (Olive Oil):

4 olive oil benefits for your face

పబ్మెడ్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ఆలివ్ ఆయిల్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ ఆర్థరైటిస్‌ను నివారించడానికి, దాని నుంచి రిలీఫ్‌ ఇవ్వడానికి సహాయపడుతుందిత. ముడి ఆలివ్ నూనెలో ఒలియోకాంథాల్ ఉంటుంది, 50 ml ఆలివ్‌ ఆయిల్‌ తీసుకున్నా..10 శాతం ఇబుప్రోఫెన్ తీసుకున్నా అదే రియాక్షన్‌ ఉంటుంది. ఆలివ్‌ ఆయిల్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పెయిన్ రిలీవర్‌గా పని చేస్తుంది. రోజుకు 1-4 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఈ డైట్‌ తీసుకోండి:

Osteoarthritis diet: 8 foods to eat and 3 to avoid

మన ఆహారంలో కొన్ని మార్పులు చేస్తే అర్థరైటిస్‌ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మీ డైట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. సీజనల్‌ పండ్లు తీసుకుంటే మేలు జరుగుతుంది. క్యారెట్, బీట్రూట్, కాప్సికం, బీన్స్, చిక్కుడు వంటి కూరగాయలను మీ ఆహారంలో చేర్చుకోండి. క్యాబేజి, కాలీఫ్లవర్, బ్రొకొలి, ముల్లంగి ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో పసుపు, అల్లం, వెల్లుల్లి ఎక్కువగా వాడాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. సాల్మన్‌ రకం చేపలు, అవిసె గింజలు, ఆలివ్‌ నూనెలో ఈ ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉంటాయి.

Also Read:  Arthritis: ఆర్థరైటిస్ నొప్పి ఉంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • arthritis
  • benefits
  • bones
  • causes
  • exercises
  • food habits
  • health
  • Life Style
  • Old people
  • Types
  • yoga

Related News

GST Slashed

GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

జీఎస్టీ తగ్గుదల వల్ల బ్యూటీ ఉత్పత్తులు, కాస్మెటిక్స్ కోసం డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ట్యాక్స్ తగ్గడంతో సెలూన్‌లకు వెళ్లడం, హెల్త్ సర్వీస్‌లను పొందడం ప్రజలకు మరింత చౌకగా ఉంటుంది.

  • Health Tips

    Health Tips: 40 ఏళ్లు రాకముందే చేయాల్సిన 4 ముఖ్యమైన వ్యాయామాలీవే!

Latest News

  • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

  • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

  • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

  • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd