HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Health
  • >Avoid These Foods If You Have Arthritis Pain

Arthritis: ఆర్థరైటిస్ నొప్పి ఉంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి

  • By Maheswara Rao Nadella Published Date - 07:00 PM, Mon - 5 December 22
  • daily-hunt
Arthritis NCBI
Arthritis

ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్, హైబీపీ, క్యాన్సర్‌లాంటి కంటే ఆర్థరైటిస్‌ (Arthritis) సమస్యతో బాధపడే వారే ఎక్కువ ఉన్నారు. దీనిలో 200 కంటే ఎక్కువ రకాల అర్థరైటిస్‌ (Arthritis) ఉన్నాయి. ఇందులో ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్, యాంకైలోజింగ్‌ స్పాండైల్‌ ఆర్థరైటిస్, గౌట్, జువెనైల్‌ ఇడియోఫథిక్‌ ఆర్థరైటిస్‌, లూపస్, సోరియాటిక్‌ ఆర్థరైటిస్‌, గౌట్‌ వంటివి కొన్ని ఉన్నాయి. అర్థరైటిస్‌ (Arthritis) ప్రధాన లక్షణాలు సాధారణంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్ల దగ్గర నొప్పి, వాపు, అవి స్టిఫ్‌గా ఉండటం, కీళ్లలో కదలికలు తగ్గడం వంటివి కనిపిస్తాయి. NCBI నివేదిక ప్రకారం, భారతదేశ జనాభాలో దాదాపు 22 నుంచి 39 శాతం మంది అర్థరైటిస్‌ (Arthritis) తో బాధపడుతున్నారు. పురుషుల కంటే స్త్రీలు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు.

ముఖ్యంగా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవారు కొన్ని ఆహార పదార్థాలకు, పానీయాలకు దూరంగా ఉంటే.. లక్షణాల తీవ్రతను తగ్గించుకోవ్చని నిపుణులు చెబుతున్నారు. అర్థరైటిస్ సమస్యతో బాధపడే వారు ఏ ఆహార పదార్థాలు తీసుకోకూడదో ఆయుర్వేద డాక్టర్‌ శరద్‌ కులకర్ణి వివరించారు.

ఉప్పు:

Nestlé prioritises low salt products and calls for reduction targets

మన శరీరానికి సోడియం అవసరం. ఉప్పు సోడియంకు ప్రధాన మూలం. కానీ, అర్థరైటిస్‌ (Arthritis) పేషెంట్స్‌ ఎక్కువగా తీసుకుంటే వారి సమస్య ఇంకా తీవ్రమవుతంది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఇన్ఫ్లమేషన్‌ పెరుగుతుంది. ఉప్పు అధికంగా తీసుకునే వారికి రుమటాయిడ్‌ అర్థరైటిస్‌ (Arthritis) సమస్య వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నారు.

పెరుగు:

Don't curtail the benefits of curd by committing these silly mistakes |  HealthShots

పెరుగు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చాలా మందికి తెలుసు. కానీ ఆర్థరైటిస్ (Arthritis) వ్యాధి ఉన్నవారు పెరుగు తినకూడదు. పెరుగులో ఉండే ట్రాన్స్ ఫ్యాట్ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. గౌట్‌ సమస్య ఉన్నవారికి కీళ్ల నొప్పులు, స్టిఫ్‌నెస్‌ మరిత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గౌట్‌ సమస్య ఉన్నవారు పెరుగుకు దూరంగా ఉండాలి.

స్వీట్స్‌:

33 Diwali Sweets Recipe in Hindi 33 मिठाई बनाने की विधि

స్వీట్స్ ఎక్కువగా తింటే శరీరంలో సైటోకిన్‌లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్లు. ఆర్థరైటిస్‌ (Arthritis) తో బాధపడుతున్న వారి శరీరంలో ఇప్పటికే అధిక స్థాయిలో సైటోకిన్‌లు ఉంటాయి. కీళ్లనొప్పులతో బాధపడేవారు స్వీట్స్‌ తింటే వారి పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.

బంగాళదుంప:

Potato nutrition facts & health benefits | Live Science

గౌట్‌తో బాధపడే వారు బంగాళదుంపలు తినకూడదని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. బంగాళదుంపలు తింటే కీళ్లలో నొప్పి, వాపు ఇంకా పెరుగుతుంది.

పాలు:

Milk: Health benefits, nutrition, and risks

ఆర్థరైటిస్‌లో పాలు తీసుకునే పేషెంట్స్‌లో తుంటి మార్పిడి కేసులు ఎక్కువగా కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అర్థరైటిస్ పేషెంట్స్‌ పాలు తాగకూడని నిపుణులు చెబుతున్నారు.

రెడ్‌ మీట్‌:

Red meat: To eat or not to eat?

రెడ్‌ మీట్‌లో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. రెడ్‌ మీట్‌ ఎక్కువగా తింటే ఇన్ఫ్లమేషన్‌ ఎక్కువవుతుంది. ఇది కీళ్ల వాపుకు దారితీస్తుంది. అర్థరైటిస్‌ పేషెంట్స్‌ రెడ్‌ మీట్‌ తింటే వారి పరిస్థితి మరింత దిగజారుతుంది.

పాలిష్‌ రైస్:

Polished rice Stock Photos, Royalty Free Polished rice Images |  Depositphotos

రైస్‌ ఎక్కువగా పాలిష్‌ చేస్తే దానిలో ఫైబర్‌, పోషకాలు చాలా వరకు పోతాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. పాలిష్‌ రైస్‌ ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయులు పెరిగే అవకాశం ఉంది. అర్థరైటిస్‌ పేషెంట్స్‌ బ్రౌన్ రైస్, క్వినోవా, తృణధాన్యాలు తినడం మంచిది.

ఈ జాగ్రత్తలు తీసుకోండి:

Vegetables

అర్థరైటిస్‌ రాకుండా ఉండాలంటే, ఫస్ట్‌ స్టేజ్‌లో ఉన్నా ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌తో దీన్ని దూరం చేయవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి, కంటినిండా నిద్ర, అన్ని రకాల పోషకాలతో కూడిన సమతులాహారం, ఒత్తిడి లేకుండా ఉండటం వంటి జాగ్రత్తలు అవసరం. ఆల్కహాల్‌, స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • arthritis
  • Arthritis Patients
  • doctor
  • food
  • food habits
  • health
  • Life Style

Related News

    Latest News

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd