Exercise: వ్యాయామం చేయడానికి సరైన సమయం ఏదో తెలుసా..?
అయితే వ్యాయామం (Exercise) చేయడానికి ఉత్తమ సమయం ఏది అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
- By Gopichand Published Date - 07:15 AM, Mon - 15 July 24

Exercise: బరువు అదుపులో ఉండాలంటే వర్కవుట్ చేయడం చాలా ముఖ్యం. చాలా మంది ఉదయం లేదా సాయంత్రం వ్యాయామశాలకు వెళతారు..లేదా ఇంట్లో వర్కౌట్స్ చేస్తారు. అయితే వ్యాయామం (Exercise) చేయడానికి ఉత్తమ సమయం ఏది అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలో వ్యాయామం చేయడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు..? మీరు కూడా ఈ విషయం గురించి గందరగోళంగా ఉంటే బరువు తగ్గడానికి వ్యాయామం చేయడానికి సరైన సమయం ఏమిటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి..!
ఉదయం ఖాళీ కడపుతో వ్యాయామం
బరువు తగ్గడానికి ఉదయం ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని కొవ్వు ఎక్కువగా కరిగిపోతుంది. దీని వల్ల జీవక్రియ కూడా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురించబడిన ఒక పరిశోధన ప్రకారం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల బరువు రెండు రెట్లు వేగంగా తగ్గుతారని పేర్కొంది.
ఉదయం ఏ సమయంలో వ్యాయామం చేయాలి?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం 7 నుండి 9 గంటల వరకు వ్యాయామం చేయడం శరీరానికి ఉత్తమమైనది. ఇది రోజంతా చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది శక్తిని పెంచుతుంది. రోజంతా మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఉదయం వ్యాయామం చేయడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. ఈ శరీరం ఉష్ణోగ్రత కూడా కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
సాయంత్రం వర్కవుట్ చేయాలా? వద్దా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గంటల తరబడి పని తర్వాత శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో మీరు బరువు తగ్గడానికి వ్యాయామం చేస్తే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉందట. అయితే సాయంత్రం పూట వ్యాయామం చేసేటపుడు పొట్ట ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. దీంతో కొవ్వు తగ్గుతుంది. సాయంత్రం పూట వ్యాయామం చేయడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయట.
ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడు వ్యాయామం చేయాలి?
ఉదయం, సాయంత్రం రెండు పూటలా వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే రెండింటినీ (ఉదయం, సాయంత్రం వ్యాయామం) పోల్చినట్లయితే ఉత్తమమైన, ఖచ్చితమైన సమయం ఉదయం మాత్రమేనని పలువురు నిపుణులు తెలిపారు. ఉదయం వ్యాయామం చేయడం వల్ల శరీరం చాలా ప్రయోజనాలను పొందుతుందట.