Orange Peel Benefits: ఆరెంజ్ తొక్కే కదా అని పారేస్తున్నారా.. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మిస్ అయినట్లే..!
ఆరెంజ్ (Orange) చాలా రుచికరమైన, జ్యుసి పండు. ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. మీకు తెలుసా.. నారింజ తొక్కలు కూడా చాలా ప్రయోజనకరంగా (Orange Peel Benefits) ఉంటాయి.
- Author : Gopichand
Date : 17-09-2023 - 11:05 IST
Published By : Hashtagu Telugu Desk
Orange Peel Benefits: ఆరెంజ్ (Orange) చాలా రుచికరమైన, జ్యుసి పండు. ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. అనేక విటమిన్లు, ఖనిజాలు ఇందులో ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి. మీకు తెలుసా.. నారింజ తొక్కలు కూడా చాలా ప్రయోజనకరంగా (Orange Peel Benefits) ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. విటమిన్ సి, కాల్షియం, ఫైబర్, ఫోలేట్ వంటి అనేక పోషకాలు నారింజ తొక్కలో లభిస్తాయి. ఇది శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. ఆరెంజ్ తొక్కతో లెక్కలేనన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఆరెంజ్ తొక్కలు బాగా సహాయపడుతాయి. ఇందులో ఫ్లేవనాయిడ్ హెస్పెరిడిన్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది
నారింజ తొక్కలో విటమిన్ సి తగినంత పరిమాణంలో ఉంటుంది. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి ఊపిరితిత్తులను రక్షిస్తుంది.
జీర్ణక్రియకు ప్రయోజనకరం
ఆరెంజ్ తొక్క జీర్ణ సమస్యలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అజీర్ణం లేదా మలబద్ధకంతో సమస్యలు ఉన్నవారికి ఈ తొక్కలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో ఉండే పెక్టిన్ కడుపులో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. జీర్ణ సమస్యలను తగ్గించుకోవడానికి, మీరు ఆరెంజ్ పీల్ టీని త్రాగవచ్చు. ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
Also Read: Guava Benefits : జామపండు తినడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసా?
రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది
ఆరెంజ్ పీల్స్ డయాబెటిక్ పేషెంట్లకు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే పెక్టిన్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.
బరువు తగ్గించడంలో సహాయపడుతుంది
ఆరెంజ్ తొక్కలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. మీరు మీ బరువు తగ్గించే ఆహారంలో ఆరెంజ్ పీల్ టీని చేర్చుకోవచ్చు. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
చర్మానికి ప్రయోజనకరం
మీరు మీ చర్మ సంరక్షణ దినచర్యలో నారింజ తొక్కను చేర్చుకోవచ్చు. ఇవి మొటిమలు, నల్లటి వలయాలు, పొడి చర్మం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ పీల్స్‌తో అనేక రకాల ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు.