Alcohol Side Effects: ప్రతిరోజూ మద్యం తాగే అలవాటు ఉందా..? అయితే ఈ విషయాలు తెలుసా..?
కొందరూ ప్రతి వారం 14 యూనిట్ల కంటే ఎక్కువ ఆల్కహాల్ తాగుతున్నారు. ఇంత మద్యం సేవించే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఒత్తిడి, ఆఫీసులో పని సంస్కృతి కారణంగా ప్రజలు రోజూ మద్యం సేవిస్తున్నారని నివేదిక పేర్కొంది.
- By Gopichand Published Date - 12:30 PM, Wed - 11 September 24

Alcohol Side Effects: మారుతున్న జీవనశైలిలో ప్రజలు తమ ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు చేసుకున్నారు. దీనికి అతి పెద్ద ఉదాహరణ మద్యం. కొందరు సందర్భం ఏదైనా మద్యం తాగుతుంటారు. కొందరికి రోజూ మద్యం సేవించే అలవాటు ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రోజూ 1-2 పింట్స్ బీర్ లేదా కొన్ని గ్లాసుల మద్యం (Alcohol Side Effects) తాగే పురుషులతో పాటు మహిళలు కూడా ఈ జాబితాలో చేరారు. ఇటీవలి పరిశోధన ప్రకారం.. వారానికి 14 యూనిట్ల కంటే ఎక్కువ ఆల్కహాల్ తాగేవారిలో మరణ ప్రమాదం 10 రెట్లు పెరుగుతుంది. ఈ వ్యక్తులకు క్యాన్సర్, గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది.
14 యూనిట్లు అంటే ఎంత మద్యం?
ప్రతి రకమైన పానీయాన్ని బట్టి ఆల్కహాల్ కౌంట్ మారవచ్చు. ఉదాహరణకు 14 యూనిట్ల ఆల్కహాల్ దాదాపు 6 పింట్ల బీరుకు సమానం. 10 గ్లాసుల వైన్ 14 యూనిట్లకు సమానం. అయితే వైద్యుల ప్రకారం ఒక పింట్ బీర్ కూడా కాలేయాన్ని దెబ్బతీస్తుంది. క్యాన్సర్ అవకాశాలను పెంచుతుంది.
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక ప్రకటన.. హైదరాబాద్, వరంగల్‌లో పోలీస్ స్కూల్స్..!
పరిశోధనలో ఏం తేలింది?
ఈ పరిశోధన ప్రకారం.. కొందరూ ప్రతి వారం 14 యూనిట్ల కంటే ఎక్కువ ఆల్కహాల్ తాగుతున్నారు. ఇంత మద్యం సేవించే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఒత్తిడి, ఆఫీసులో పని సంస్కృతి కారణంగా ప్రజలు రోజూ మద్యం సేవిస్తున్నారని నివేదిక పేర్కొంది. యువకులు ప్రతి వారాంతంలో స్నేహితులతో పార్టీలు చేసుకునే సమయంలో లేదా మ్యాచ్ చూస్తున్నప్పుడు లెక్కలేనన్ని పింట్స్ బీర్ తాగుతున్నట్లు పరిశోధనలో తేలింది. ఇది వ్యక్తుల ఆరోగ్యానికి హానికరం. రోజుకు ఒక్క బీరు కూడా ప్రాణానికి హానికరం అంటున్నారు పరిశోధకులు. ఈ జాబితాలో ధూమపానం కూడా ఉంది.
ఇలా చేయడం ఎంత ప్రమాదకరం?
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు 1 గ్లాసు వైన్ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది. రోజూ మద్యం సేవించడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. రోజూ మద్యం సేవించడం వల్ల డిమెన్షియా వస్తుంది. దీని వల్ల టైప్-2 మధుమేహం, బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం వంటి అనేక ప్రమాదాలను కూడా పరిశోధనలో చేర్చారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. వారానికి 25 నుండి 30 యూనిట్ల ఆల్కహాల్ తాగే వారు వెంటనే తమ అలవాటును మెరుగుపరచుకోవాలని సూచించారు. లేకపోతే ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని హెచ్చరించారు. 2018లో 25-30 యూనిట్ల మధ్య మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య 40,000గా ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.